ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Market: నష్టాలతోనే ప్రారంభం.. 450 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..

ABN, Publish Date - Dec 30 , 2024 | 04:10 PM

విదేశీ మదుపర్లు పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి రికార్డు స్థాయిలో బలహీనపడడం, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు మదుపర్లలో ఆందోళన పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి.

Stock Market

గత వారం దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న దేశీయ సూచీలు ఈ వారాన్ని కూడా అదే ధోరణితో ప్రారంభించాయి. విదేశీ మదుపర్లు పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి రికార్డు స్థాయిలో బలహీనపడడం, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు మదుపర్లలో ఆందోళన పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ ఇంట్రాడే హై నుంచి ఏకంగా 800 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. (Business News).


గత శుక్రవారం ముగింపు (78, 699)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 60 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత క్రమంగా లాభాల్లోకి వెళ్లింది. ఒక దశలో దాదాపు 400 పాయింట్లు లాభపడి 79, 092 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలవడంతో క్రమంగా నష్టాలోకి జారుకుంది. ఇంట్రాడే గరిష్టం నుంచి 1000 పాయింట్లకు పైగా కోల్పోయి 78, 077 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు 450 పాయింట్ల నష్టంతో 78, 248 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే ఒడిదుడుకులు ఎదుర్కొంది. చివరకు 168 పాయింట్ల నష్టంతో 23, 644 వద్ద రోజును ముగించింది.


సెన్సెక్స్‌లో అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఐఆర్‌ఎఫ్‌సీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు లాభాలు అందుకున్నాయి. జిందాల్ స్టెయిన్‌లెస్, ప్రెస్టేజ్ ఎస్టేట్, సైయింట్, భెల్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 209 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 358 పాయింట్లు నష్టపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.53గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 30 , 2024 | 04:36 PM