ఫ్రెషర్లకు రూ.9.5 లక్షల ప్యాకేజీ!
ABN, Publish Date - Aug 21 , 2024 | 05:40 AM
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్ ప్రాంగణ నియామకాల (క్యాంపస్ ప్లేస్‌మెంట్) ప్రక్రియలో భాగంగా పవర్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంపిక చేసిన కాలేజీల నుంచి నియమించుకునే ఫ్రెషర్లకు రూ.9 లక్షల వరకు...
పవర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన ఇన్ఫోసిస్
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్ ప్రాంగణ నియామకాల (క్యాంపస్ ప్లేస్‌మెంట్) ప్రక్రియలో భాగంగా పవర్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంపిక చేసిన కాలేజీల నుంచి నియమించుకునే ఫ్రెషర్లకు రూ.9 లక్షల వరకు వార్షిక పారితోషికాన్ని ఆఫర్ చేస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా కంపెనీ ఫ్రెషర్లకు ఆఫర్ చేసే రూ.3-3.5 లక్షల వార్షిక ప్యాకేజీతో పోలిస్తే చాలా అధికమిది. పవర్ ప్రోగ్రామ్‌లో ఫ్రెషర్లకు సాఫ్ట్‌వేర్ కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా పారితోషికాన్ని ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. గత ఏడాది కాలంలో హైరింగ్‌ను బాగా తగ్గించిన ఇన్ఫోసిస్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా 15,000-20,000 మంది గ్రాడ్యుయేట్లను చేర్చుకోనున్నట్లు జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా వెల్లడించింది.
Updated Date - Aug 21 , 2024 | 05:40 AM