ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తగ్గిన భారత వాణిజ్య లోటు

ABN, Publish Date - May 27 , 2024 | 02:39 AM

విదేశాలతో భారత వాణిజ్య లోటు పెరిగి పోతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం 26,490 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ లోటు 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 23,830 కోట్ల డాలర్లకు తగ్గింది. అయితే...

  • తొమ్మిది దేశాలతో మాత్రం పెరుగుదల

న్యూఢిల్లీ : విదేశాలతో భారత వాణిజ్య లోటు పెరిగి పోతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరం 26,490 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ లోటు 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 23,830 కోట్ల డాలర్లకు తగ్గింది. అయితే మన దేశానికి ప్రధాన వాణిజ్య దేశాలైన 10 దేశాల్లో ఒక్క అమెరికాతో తప్ప మిగతా తొమ్మిది దేశాలతో ఈ లోటు మరింత పెరిగింది. చైనా, రష్యా, సింగపూర్‌, హాంకాంగ్‌, కొరియా వంటి దేశాలు మన దేశం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల కంటే.. ఎక్కువ ఎగుమతి చేసి పెద్ద మొత్తంలో వాణిజ్య మిగులు నమోదు చేశాయి. 2022-23తో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో యూఏఈ, సౌదీ అరేబియా, రష్యా, ఇండోనేషియా, ఇరాక్‌లతో మన వాణిజ్య లోటు తగ్గింది. చైనాతో మాత్రం అత్యధికంగా 8,500 కోట్ల డాలర్ల లోటు కొనసాగుతోంది. చమురు దిగుమతుల పుణ్యమాని గత ఆర్థిక సంవత్సరం రష్యాతోనూ మన దేశానికి 5,720 కోట్ల డాలర్ల లోటు ఏర్పడింది. చైనా నుంచి అధిక దిగుమతుల ప్రభావం దేశ భద్రతనూ దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - May 27 , 2024 | 02:40 AM

Advertising
Advertising