ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లకు ఆర్‌బీఐ ఆఫర్‌!

ABN, Publish Date - Apr 27 , 2024 | 05:27 AM

సార్వజనిక (యూనివర్సల్‌) బ్యాంకులుగా మారేందుకు అర్హత కలిగిన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్స్‌ (ఎ్‌సఎ్‌ఫబీ) నుంచి ఆర్‌బీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. యూనివర్సల్‌ బ్యాంక్‌గా మారాలనుకుంటున్న ఎస్‌ఎ్‌ఫబీలు ఈ మార్చితో

సార్వజనిక బ్యాంక్‌గా మారేందుకు దరఖాస్తుల ఆహ్వానం

ముంబై: సార్వజనిక (యూనివర్సల్‌) బ్యాంకులుగా మారేందుకు అర్హత కలిగిన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్స్‌ (ఎ్‌సఎ్‌ఫబీ) నుంచి ఆర్‌బీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. యూనివర్సల్‌ బ్యాంక్‌గా మారాలనుకుంటున్న ఎస్‌ఎ్‌ఫబీలు ఈ మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి కనీసం రూ.1,000 కోట్ల నెట్‌వర్త్‌ను కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే, ఎస్‌ఎ్‌ఫబీల షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టయి ఉండాలని శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అంతేకాదు, గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో నికర లాభాలను నమోదు చేసుకోవడంతో పాటు స్థూల నిరర్థక ఆస్తులు (గ్రాస్‌ ఎన్‌పీఏ) 3 శాతం అంతకన్నా తక్కువగా, నికర ఎన్‌పీఏలు ఒక శాతం అంతకన్నా తక్కువగా ఉండాలి. 2014 నవంబరులో ఆర్‌బీఐ ఎస్‌ఎ్‌ఫబీల లైసెన్సు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ సహా దాదాపు డజను ఎస్‌ఎ్‌ఫబీలున్నాయి.

ఎల్‌ఎ్‌సపీలకు కొత్త నిబంధనలు

బ్యాంకులకు ఏజెంట్లుగా వ్యవహరించే లెండింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల (ఎల్‌ఎ్‌సపీ)కు ఆర్‌బీఐ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. ఇకపై ఎల్‌ఎ్‌సపీలు తాము ఆఫర్‌ చేసే అన్ని రుణాల సమాచారాన్ని రుణగ్రహీతలకు తెలియజేయాల్సి ఉంటుంది. తద్వారా రుణగ్రహీతలు మరింత మెరుగ్గా నిర్ణయం తీసుకోగలగడంతో పాటు ఎల్‌ఎ్‌సపీల సేవల్లో పారదర్శకత పెరగనుంది. చాలా ఎల్‌ఎ్‌సపీలు ఏక కాలంలో పలు బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలకు చెందిన రుణ పథకాల విక్రయ ఏజెంట్లుగా వ్యవహరిస్తుంటాయి.

Updated Date - Apr 27 , 2024 | 05:27 AM

Advertising
Advertising