భీమా జువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్ రామ్‌చరణ్
ABN, Publish Date - Apr 10 , 2024 | 02:03 AM
ఆభరణాల రిటైలింగ్‌లోని భీమా జువెలర్స్ ప్రముఖ నటుడు రామ్‌చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఇది భీమా జువెలర్స్ చరిత్రలో ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరిస్తుందని...
హైదరాబాద్: ఆభరణాల రిటైలింగ్‌లోని భీమా జువెలర్స్ ప్రముఖ నటుడు రామ్‌చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఇది భీమా జువెలర్స్ చరిత్రలో ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరిస్తుందని కంపెనీ ఈ సందర్భంగా తెలిపింది. తమ బ్రాండ్ ప్రయాణంలో ఇది ఒక మహోజ్వల ఘట్టంగా నిలుస్తుందని భావిస్తున్నామని, ఇది సినిమా ఆకర్షణకు, కళా నైపుణ్యానికి మధ్య అనుబంధమని కంపెనీ చైర్మన్ బీ బిందుమాధవ్ అన్నారు. శతాబ్ది చరిత్ర కలిగిన, సాంప్రదాయం-నైపుణ్యాల మేలి కలయిక అయిన బ్రాండ్‌కు తాను ప్రచారకర్తగా వ్యవహరించడం ఆనందదాయకంగా ఉన్నదని రామ్‌చరణ్ ఈ సందర్భంగా అన్నారు.
Updated Date - Apr 10 , 2024 | 02:03 AM