ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఫిట్‌డే’లో మహేశ్‌ బాబు పెట్టుబడి

ABN, Publish Date - Sep 10 , 2024 | 02:55 AM

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ఇన్వెస్టర్‌గా మారారు. తాజాగా హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే పోషకాహార ఉత్పత్తుల స్టార్టప్‌ కంపెనీ ‘ఫిట్‌డే’లో పెట్టుబడి పెట్టారు. తన నేతృత్వంలోని...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ఇన్వెస్టర్‌గా మారారు. తాజాగా హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే పోషకాహార ఉత్పత్తుల స్టార్టప్‌ కంపెనీ ‘ఫిట్‌డే’లో పెట్టుబడి పెట్టారు. తన నేతృత్వంలోని జీఎంబీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ కంపెనీ ద్వారా ఆయన ఈ పెట్టుబడి పెట్టారు. అయితే ఎంత మొత్తం పెట్టుబడి పెట్టిందీ వెల్లడించలేదు. ఫిట్‌డే మంచి పోషకాలతో ఆరోగ్యానికి దోహదం చేసే ఆహార ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్‌ చేస్తోంది. మహేశ్‌ బాబు తమ స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టడం తమ కంపెనీ చరిత్రలో ఒక ప్రధాన మైలు రాయి అని ఫిట్‌డే తెలిపింది. ఈ పెట్టుబడితో ఫిట్‌డే తన ఉత్పత్తులను జాతీయ స్థాయికి విస్తరించనుంది.

Updated Date - Sep 10 , 2024 | 02:55 AM

Advertising
Advertising