ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HCL Tech : హెచ్‌సీఎల్‌ టెక్‌ భళా

ABN, Publish Date - Jul 13 , 2024 | 05:10 AM

హెచ్‌సీఎల్‌ టెక్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. జూన్‌ త్రైమాసికానికి కంపెనీ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 20.4 శాతం వృద్ధి చెంది రూ.4,257 కోట్లకు చేరుకుంది.

ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్‌

న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్‌ టెక్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. జూన్‌ త్రైమాసికానికి కంపెనీ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 20.4 శాతం వృద్ధి చెంది రూ.4,257 కోట్లకు చేరుకుంది. ఆదాయం 6.6 శాతం పెరిగి రూ.28,057 కోట్లుగా నమోదైంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆదాయం వృద్ధి 3-5 శాతంగా నమోదుకావచ్చని కంపెనీ అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అర్హులైన వాటాదారుల రికార్డు తేదీని ఈనెల 23గా నిర్ణయించిన కంపెనీ.. వచ్చేనెల 1న డివిడెండ్‌ చెల్లింపులు జరపనుంది.

Updated Date - Jul 13 , 2024 | 05:10 AM

Advertising
Advertising
<