ప్రపంచ టాప్-100 బ్రాండ్లలో నాలుగు భారత కంపెనీలు
ABN, Publish Date - Jun 13 , 2024 | 04:39 AM
ప్రపంచంలోని అత్యంత విలువైన 100 బ్రాండ్ల జాబితాలో భారత్ నుంచి నాలుగు కంపెనీలకు చోటు దక్కింది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ 46వ స్థానంలో నిలవగా...
టీసీఎస్, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఎయిర్‌టెల్, ఇన్ఫోసి్‌సలకు చోటు
కాంటార్ బ్రాండ్జ్ రిపోర్టు వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత విలువైన 100 బ్రాండ్ల జాబితాలో భారత్ నుంచి నాలుగు కంపెనీలకు చోటు దక్కింది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ 46వ స్థానంలో నిలవగా ప్రైవేట్ బ్యాంకింగ్ సేవల దిగ్గజం హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ 47వ స్థానంలో ఉంది. టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ 73వ స్థానంలో, ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ 74వ స్థానంలో ఉన్నాయి. అంతేకాదు, అత్యంత విలువైన గ్లోబల్ బీ2బీ టెక్నాలజీ బ్రాండ్ల లిస్ట్‌లో ఇన్ఫీ 20వ స్థానాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయ మార్కెటింగ్ డేటా అండ్ అనలిటిక్స్ కంపెనీ కాంటార్ బ్రాండ్జ్ ఈ ఏడాదికిగాను విడుదల చేసిన మోస్ట్ వేల్యువబుల్ గ్లోబల్ బ్రాండ్స్ రిపోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది.
కంపెనీ బ్రాండ్ విలువ
(కోట్ల డాలర్లు)
టీసీఎస్ 4,479.0
హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ 4,326.0
ఎయిర్‌టెల్ 2,526.3
ఇన్ఫోసిస్ 2,468.6
Updated Date - Jun 13 , 2024 | 04:39 AM