ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Elon Musk: ఎలాన్ మస్క్‌పై వెయ్యి కోట్ల దావా వేసిన నలుగురు..అసలేమైంది?

ABN, Publish Date - Mar 05 , 2024 | 09:37 AM

ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్‌(Elon Musk) మరోసారి వార్తల్లో నిలిచారు. మస్క్‌పై నలుగురు వ్యక్తులు వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించాలని కోర్టులో దావా వేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

ప్రపంచంలోనే అత్యంత రెండో సంపన్నుడిగా ఉన్న ఎలాన్ మస్క్(Elon Musk) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మస్క్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్‌పై నలుగురు వ్యక్తులు కోర్టులో 128 మిలియన్ డాలర్లకుపైగా(రూ.1061,28,96,000) చెల్లించాలని దావా(lawsuit) వేశారు. అయితే ఈ నలుగురు వ్యక్తులు ట్విట్టర్ నుంచి వారిని తొలగించిన తర్వాత తమకు ఇవ్వాల్సిన పరిహారం పూర్తిగా ఇవ్వలేదని ఆరోపించారు.

ఈ క్రమంలో కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు(federal court)లో ఈ కేసు నమోదు చేశారు. పరాగ్ అగర్వాల్‌(Parag Agrawal)తో పాటు మస్క్‌పై కేసు నమోదు చేసిన ముగ్గురు వ్యక్తులు మాజీ ట్విటర్ CFO నెడ్ సెగల్, మాజీ చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ్ గద్దె జనరల్ కౌన్సెల్ షాన్ అగేట్. పిటిషనర్ల తరపున దాఖలు చేసిన కేసులో మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన వెంటనే సరైన కారణం లేకుండా ఆ వ్యక్తులను కంపెనీ నుంచి తొలగించారని పేర్కొన్నారు.


కంపెనీ తమకు నష్టపరిహారం చెల్లించకుండా ఉండేందుకు కల్పిత కారణాలు చెప్పారని వారు అన్నారు. మస్క్ డబ్బును ఉపయోగించి తన నుంచి భిన్నంగా ఆలోచించే వారిని పక్కన పెట్టాడని వారు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయా వ్యక్తులు మస్క్ నుంచి 128 మిలియన్ డాలర్లు(USD 128 million) లేదా రూ. 1061 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్(demand) చేశారు.

ఇక ఎలోన్ మస్క్ 2022లో 44 బిలియన్ డాలర్లు చెల్లించి ట్విట్టర్‌ని కొనుగోలు చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఆ సమయంలో కంపెనీ సీఈవోగా(Former Twitter CEO) పరాగ్ అగర్వాల్ అన్నారు. ఆ తర్వాత సీఈఓ సహా అనేక మంది ఉద్యోగులను మస్క్ తొలగించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Israel Gaza war: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వేళ భారత్ కీలక నిర్ణయం

Updated Date - Mar 05 , 2024 | 11:06 AM

Advertising
Advertising