ఫాక్స్‌కాన్ నుంచి త్వరలో విద్యుత్ వాహనాలు
ABN, Publish Date - Aug 19 , 2024 | 04:01 AM
కాంట్రాక్టు పద్దతిలో ఎలకా్ట్రనిక్ ఉపకరణా లు తయారు చేసే తైవాన్ కంపెనీ ‘ఫాక్స్‌కాన్’ భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఇందులో భాగంగా...
త్వరలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి ప్లాంట్‌పైనా నిర్ణయం
శ్రీపెరంబుదూర్ (తమిళనాడు): కాంట్రాక్టు పద్దతిలో ఎలకా్ట్రనిక్ ఉపకరణా లు తయారు చేసే తైవాన్ కంపెనీ ‘ఫాక్స్‌కాన్’ భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఇందు లో భాగంగా విద్యుత్ వాహనాల (ఈవీ) రంగంలోకి ప్రవేశిస్తోం ది. త్వరలోనే ఈ ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి ప్రారంభమవుతుందని ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న కంపెనీ చైర్మన్ యంగ్ లీ చెప్పారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి ప్లాంట్ ఏర్పాటుపైనా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ప్లాంటు కోసం తమిళనాడు, కర్ణాటకతో పాటు తెలంగాణ కూడా పోటీపడుతోంది. తమ రాష్ట్రంలో ఈ ప్లాంటు ఏర్పాటు చేస్తే పలు రాయితీలు కల్పిస్తామని ఇటీవల తమను కలిసిన లీకి ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హామీ ఇచ్చారు. దీంతో ఫాక్స్‌కాన్ ఈ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేస్తుందన్న ఉత్కంఠత నెలకొంది.
తైవాన్‌లోనే తొలి ప్లాంట్: ఫాక్స్‌కాన్ ఇటీవలే తైవాన్‌లో ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఇ-బస్సుల నుంచి ఈ బ్యాటరీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ తరహా ప్లాంటు తమ దేశంలోనూ ఏర్పాటు చేయాలని ఇండోనేషియా ప్రభుత్వం ఫాక్స్‌కాన్‌ను కోరింది. ఇపుడు భారత్‌లోనూ ఈ తరహా ప్లాంటు ఏర్పాటుకు కంపెనీ సిద్ధమవుతోంది. దేశంలో వేగంగా పెరుగుతున్న ఈవీల అమ్మకాలతో ఈ బ్యాటరీ ఇంధన స్టోరేజి యూనిట్లకు మంచి డిమాండ్ ఉంటుందని భావిస్తోంది.
Updated Date - Aug 19 , 2024 | 04:01 AM