ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మరింత సులభంగా రైట్స్‌ ఇష్యూలు!

ABN, Publish Date - Aug 21 , 2024 | 05:29 AM

నిధుల సమీకరణ కోసం కంపెనీలు జారీ చేసే రైట్స్‌ ఇష్యూలను మరింత సులభతరం చేయాలని మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ భావిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలతో...

న్యూఢిల్లీ: నిధుల సమీకరణ కోసం కంపెనీలు జారీ చేసే రైట్స్‌ ఇష్యూలను మరింత సులభతరం చేయాలని మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ భావిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలతో ఒక చర్చాపత్రం విడుదల చేసింది. సంబంధిత పార్టీలన్నీ ఈ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను వచ్చే నెల 10వ తేదీలోగా తనకు పంపాలని కోరింది. సెబీ ప్రతిపాదనలు ఇవే..

  • రైట్స్‌ ఇష్యూల్లో మర్చంట్‌ బ్యాంకర్ల అవసరాన్ని తొలగించి ఆ బాధ్యతను రిజిస్ట్రార్లు లేదా స్టాక్‌ ఎక్స్చేంజీలకు అప్పగించడం

  • రైట్స్‌ ఇష్యూల ద్వారా సమీకరించిన నిధుల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్‌ ఏజెన్సీ ఏర్పాటు

  • రైట్స్‌ ఇష్యూ సమయానికి ఆ కంపెనీ షేర్ల ట్రేడింగ్‌పై నిషేధం ఉంటే రైట్స్‌ ఇష్యూని అనుమతించకూడదు.

  • లెటర్‌ ఆఫ్‌ ఆఫర్‌లో రైట్స్‌ ఇష్యూకి సంబంధించిన వివరాలు మాత్రమే వెల్లడించేలా నిబంధనల హేతుబద్దీకరణ

  • కంపెనీల బోర్డు ఆమోదించిన తర్వాత రైట్స్‌ ఇష్యూల గడువును టీ+20 వర్కింగ్‌ డేస్‌కు కుదించడం

  • రైట్స్‌ ఇష్యూకి వచ్చిన దరఖాస్తుల వ్యాలిడిటీ, షేర్ల కేటాయింపు ప్రాతిపదికను నిర్ణయించే విషయం రిజిస్ట్రార్లతో పాటు స్టాక్‌ ఎక్స్చేంజీలు, డిపాజిటరీ సంస్థలకు అప్పగించడం సెబీ ప్రతిపాదన

Updated Date - Aug 21 , 2024 | 05:29 AM

Advertising
Advertising
<