ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sensex and Nifty: సరికొత్త శిఖరాలపై దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. ఒకే రోజు రూ. 2.76 లక్షల కోట్లు లాభపడ్డ ఇన్వెస్టర్లు

ABN, Publish Date - Jan 12 , 2024 | 04:10 PM

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex), ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి సంబంధించి టెక్ రంగ కంపెనీలు, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇంధన రంగ కంపెనీల ఫలితాలు సానుకూలంగా ఉండడంతో వారాంతం శుక్రవారం నాడు మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి.

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex), ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) శుక్రవారం సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి సంబంధించి టెక్ రంగ కంపెనీలు, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇంధన రంగ కంపెనీల ఫలితాలు సానుకూలంగా ఉండడంతో శుక్రవారం నాడు మార్కెట్లలో జోష్ కనిపించింది. భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో గరిష్ఠంగా 1000 పాయింట్లు వృద్ధి చెంది జీవనకాల గరిష్ఠం 72,720.96 మార్క్‌ను తాకింది. అయితే చివరకు 847 పాయింట్లు లాభపడి 72,550 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్ఈ నిఫ్టీ దాదాపు 281 పాయింట్లు లాభపడి జీవితకాల గరిష్ఠ స్థాయి 21,928.25 పాయింట్ల వద్ద ముగిసింది. శుక్రవారం ఒక్క రోజే బీఎస్ఈ సెన్సెక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.2.76 లక్షల కోట్ల మేర వృద్ధి చెంది రూ.373.24 లక్షల కోట్లకు చేరింది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ షేర్లు గణనీయంగా లాభపడ్డాయి.


బీఎస్ఈపై మొత్తం 477 స్టాక్స్ జీవితకాల గరిష్ఠ స్థాయిలో ముగిశాయి. బీఎస్ఈ 500 స్టాక్స్‌లో అబ్బాట్ ఇండియా, అంబెర్, అలెంబిక్ ఫార్మాష్యూటికల్స్, అపోలో హాస్పిటల్స్, అవంతీ ఫీడ్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీబీటీసీ, బికజీ, బీఎల్ఎస్, బిర్లాసాఫ్ట్, కోఫోర్జ్, డీఎల్ఎఫ్ షేర్లు ఏడాది గరిష్ఠంలో ముగిశాయి. కాగా మరో స్టాక్స్ ఏడాది కాల కనిష్ఠంలో ముగిశాయి. మొత్తం 3,870 స్టాక్స్‌లో 2,212 షేర్లు గ్రీన్‌లో, 1543 షేర్లు రెడ్‌లో ముగిశాయి.

Updated Date - Jan 12 , 2024 | 04:12 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising