భీమవరంలో కెనరా బ్యాంక్ రీజినల్ కార్యాలయా బ్యాంక్
ABN, Publish Date - Aug 18 , 2024 | 01:12 AM
ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో కెనరా బ్యాంక్ రీజినల్ కార్యాలయాన్ని బ్యాంక్ ఎండీ, సీఈఓ కే. సత్యనారాయణ రాజు శనివారం నాడు లాంఛనంగా ప్రారంభించారు...
ఆంధ్రప్రదేశ్, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో కెనరా బ్యాంక్ రీజినల్ కార్యాలయాన్ని బ్యాంక్ ఎండీ, సీఈఓ కే. సత్యనారాయణ రాజు శనివారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఖాతాదారులకు బ్యాంక్ అందిస్తున్న వివిధ పథకాలు, సాధించిన అభివృద్ధి గురించి వివరించారు. బ్యాంకుల విలీనం అనంతరం కెనరా బ్యాంక్ వ్యాపారం రూ.16 లక్షల కోట్ల నుంచి రూ.23 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Updated Date - Aug 18 , 2024 | 01:12 AM