హైదరాబాద్‌లో కాల్ సెంటర్
ABN, Publish Date - Aug 31 , 2024 | 06:35 AM
పాలసీబజార్ దక్షిణ భారత్‌లో తన కార్యకలపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో హైదరాబాద్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. 20 నుంచి 25 మంది ఉద్యోగులు ఈ
పాలసీబజార్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): పాలసీబజార్ దక్షిణ భారత్‌లో తన కార్యకలపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో హైదరాబాద్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. 20 నుంచి 25 మంది ఉద్యోగులు ఈ సెంటర్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఖాతాదారులకు సేవలు అందిస్తారని పాలసీబజార్ అనుబంధ సంస్థ పీబీపార్ట్‌నర్స్ మోటార్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ అభిమన్యు శర్మ చెప్పారు. అక్టోబరు నాటికి తమ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం కూడా ప్రారంభమవుతుందన్నారు. పాలసీబజార్ ఆదాయంలో 73 శాతం మోటార్ ఇన్సూరెన్స్ ద్వారా వస్తోందన్నారు. ఇందులో 45 శాతం వాటా వాణిజ్య వాహనాలు, 35 శాతం ద్విచక్ర వాహానాల బీమా ద్వారా వస్తోందన్నారు. పీబీ పార్ట్‌నర్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పాలసీలను ప్రజలకు మరింత చేరువ చేయనున్నట్టు తెలిపారు. పాలసీల నమోదు నుంచి క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ వరకు ఈ పార్ట్‌నర్స్ సేవలు అందిస్తారని శర్మ చెప్పారు.
Updated Date - Aug 31 , 2024 | 06:35 AM