ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BSNL Offers: డేటా ఎక్కువ వినియోగించేవారికి సూపర్ ఆఫర్.. ఏకంగా 425 రోజులపాటు!

ABN, Publish Date - Apr 25 , 2024 | 04:37 PM

ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ మార్కెట్‌లో వినియోగదారుల విషయంలో ప్రధాన పోటీదారులైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ (వోడాఫోన్ ఐడియా)లతో వెనుకబడి ఉండొచ్చు. కానీ యూజర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. తమ ప్లాన్స్‌ను పొడగించుకోవాలనుకునేవారి యూజర్ల కోసం తాజాగా మరో ఆకర్షణీయమైన నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌తో ప్రకటించింది.

ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ మార్కెట్‌లో వినియోగదారుల విషయంలో ప్రధాన పోటీదారులైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ (వోడాఫోన్ ఐడియా)లతో వెనుకబడి ఉండొచ్చు. కానీ యూజర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. తమ ప్లాన్స్‌ను పొడగించుకోవాలనుకునేవారి యూజర్ల కోసం తాజాగా మరో ఆకర్షణీయమైన నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌తో ప్రకటించింది. ఏకంగా 425 రోజుల వ్యాలిడిటీతో ప్రకటించిన ఈ ఆఫర్‌కు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.


425 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ఫ్లాన్‌ను రూ.2,398లకు అందిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ ప్లాన్‌లో యూజర్లు అపరిమిత కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు. డేటా విషయానికి వస్తే యూజర్లకు మొత్తం 850 జీడీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 2 జీబీ డేటా లభిస్తుందనమాట. ఇక ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను పొందొచ్చు. రెగ్యులర్‌గా ఇంటర్నెట్ ఉపయోగించే యూజర్ల కోసం కంపెనీ ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. త్వరగా డేటా పూర్తవడం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిని ఉద్దేశించి ఈ ప్లాన్‌ను రూపొందించింది.


అయితే దేశంలో ఎంపిక చేసిన నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే ఈ ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. యూజర్లు తమ ప్రాంతంలో 425 రోజుల ప్లాన్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఆఫర్ అందుబాటులో ఉంటే ఆసక్తిగల వారు పొందొచ్చు అని బీఎస్ఎన్ఎల్ వివరించింది. కాగా ఇటీవల పలు ప్లాన్ల వ్యాలిటిడీని పెంచి యూజర్లను బీఎస్ఎన్ఎల్ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.

Updated Date - Apr 25 , 2024 | 04:37 PM

Advertising
Advertising