బీఎస్ఈ షేరు 19% పతనం
ABN, Publish Date - Apr 30 , 2024 | 06:19 AM
దేశంలో తొలి స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎ్‌సఈ షేరు ఇంట్రాడే ట్రేడింగ్‌లో దాదాపు 19ు క్షీణించి రూ.2,612.10 వద్దకు పతనమైంది. చివరికి 13.31ు నష్టంతో రూ.2,783 వద్ద ముగిసింది...
రెగ్యులేటరీ ఫీజుపై సెబీ తాజా ఆదేశాలే కారణం
దేశంలో తొలి స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎ్‌సఈ షేరు ఇంట్రాడే ట్రేడింగ్‌లో దాదాపు 19ు క్షీణించి రూ.2,612.10 వద్దకు పతనమైంది. చివరికి 13.31ు నష్టంతో రూ.2,783 వద్ద ముగిసింది. రెగ్యులేటరీ ఫీజుపై బీఎస్‌ఈకి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ జారీ చేసిన తాజా ఆదేశాలే ఇందుకు కారణం. ఆప్షన్స్ కాంట్రాక్టుల వార్షిక టర్నోవర్‌పై ప్రీమియం విలువకు బదులు నోషనల్ వేల్యూ ఆధారంగా ఫీజు చెల్లించాలని బీఎ్‌సఈని ఆదేశించింది. దాంతో ఎక్స్ఛేంజ్ ప్రస్తుతం చెల్లిస్తున్న దాని కంటే అధిక రుసుము చెల్లించాల్సి వస్తుంది. ఇకపై చెల్లించబోయే రుసుముతో పాటు గత కాలానికీ కొత్త నిబంధన వర్తిస్తుందని సెబీ స్పష్టం చేసింది. కాబట్టి, గత సంవత్సరాలకు చెందిన వ్యత్యాస రుసుమును సైతం 15 శాతం వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. దీన్నిబట్టి 2006-07 నుంచి 2022-23 వరకు వ్యత్యాస రుసుము కింద బీఎ్‌సఈ రూ.68.64 కోట్లు (జీఎ్‌సటీ అదనం), 2023-24 ఆర్థిక సంవత్సరానికి మరో రూ.96.30 కోట్లు+జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉంటుంది.
Updated Date - Apr 30 , 2024 | 06:34 AM