ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వికసిత్‌ భారత్‌లో భాగస్వాములవ్వండి

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:48 AM

వచ్చే ఐదేళ్ల కాలంలో ప్రపంచంలోనే మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే బాట లో భారత్‌ బలంగా నిలిచి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. తన మూడో విడత అధికార సమయంలోనే...

దేశీయ పరిశ్రమకు మోదీ పిలుపు

న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్ల కాలంలో ప్రపంచంలోనే మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే బాట లో భారత్‌ బలంగా నిలిచి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. తన మూడో విడత అధికార సమయంలోనే ఈ ఘనత సాధిస్తామన్న విశ్వాసం ఆయన ప్రకటించారు. ప్రపంచ ఇన్వెస్టర్లు భారత్‌ను ఒక పెట్టుబడి గమ్యంగా చూస్తున్నారంటూ వికసిత్‌ భారత్‌ ప్రయాణం లో భాగస్వాములయ్యే సువర్ణావకాశాన్ని వదులుకోవద్దని దేశీయ పరిశ్రమ (ఇండియా ఇంక్‌)కు ఆయన పిలుపు ఇచ్చారు. ‘‘వికసిత్‌ భారత్‌ బాటలో ప్రయాణం’’ పేరిట సీఐఐ నిర్వహించిన పోస్ట్‌ బడ్జెట్‌ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. భారతదేశ వృద్ధి గాధకు సంపద సృష్టికర్తలే చోదక శక్తి అన్నారు. భారత్‌ అనుసరిస్తున్న విధానాలు, కట్టుబాట్లు, సంకల్పం, నిర్ణయాలు, పెట్టుబడులు ప్రపంచ పురోగతికి ఆలంబనగా మారాయని చెప్పారు.


పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు రూపొందించాలని, పెట్టుబడి విధానాల్లో స్పష్టత తేవాలని ఇటీవల నీతి ఆయోగ్‌ సమావేశంలో రాష్ర్టాలకు తాను సూచించినట్టు ప్రధాని గుర్తు చేశారు. జాతి ప్రథమం సూత్రం ఆధారంగానే మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, తమకు రాజకీయ సంకుచిత భావాలు లేవని ఆయన స్పష్టం చేశారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చి దిద్దే ప్రయత్నంలో ప్రభుత్వంతో పోటీ పడాలని దేశీయ పరిశ్రమకు ప్రధాని పిలుపు ఇచ్చారు.

Updated Date - Jul 31 , 2024 | 12:48 AM

Advertising
Advertising
<