ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు అవార్డు

ABN, Publish Date - Apr 19 , 2024 | 02:33 AM

జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌)కు మరో పురస్కారం లభించింది. ఈ ఏడాది గాను భారత్‌తో పాటు దక్షిణాసియాలో ‘అత్యుత్తమ విమానాశ్రయ సిబ్బంది’ అవార్డును...

జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌)కు మరో పురస్కారం లభించింది. ఈ ఏడాది గాను భారత్‌తో పాటు దక్షిణాసియాలో ‘అత్యుత్తమ విమానాశ్రయ సిబ్బంది’ అవార్డును దక్కించుకుంది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఈ నెల 17న నిర్వహించిన ‘ప్యాసింజర్‌ టెర్మినల్‌ ఎక్స్‌పో 2024’లో గ్లోబల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ రేటింగ్‌ సంస్థ స్కైట్రాక్స్‌ ఈ అవార్డును ప్రకటించింది. విమానాశ్రయంలో ప్రయాణికులకు ఆయా సేవలందించే సిబ్బంది వైఖరి, స్నేహపూర్వకత, సమర్థత వంటి అంశాల పరిశీలన ఆధారంగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ను ఎంపిక చేసినట్లు స్కైట్రాక్స్‌ పేర్కొంది.

ఎయిర్‌పోర్ట్‌లో ఏఏఐ వాటా విక్రయం!?

లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) మూడో విడత విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టనుందని సమాచారం. ఈ సారి మరో 13 విమానాశ్రయాలను ప్రైవేటీకరించనున్నట్లు తెలిసింది. అంతేకాదు, బెంగళూరు, హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో తనకున్న స్వల్ప వాటానూ విక్రయించాలని ఏఏఐ భావిస్తోందని ఇద్దరు సీనియర్‌ అఽధికారుల తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 74 శాతం వాటా జీఎంఆర్‌ చేతుల్లో ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం, ఏఏఐ 13 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి.

Updated Date - Apr 19 , 2024 | 02:33 AM

Advertising
Advertising