అదానీ కుటుంబం.. రూ.30,000 కోట్ల వాటాల విక్రయం!
ABN, Publish Date - Aug 24 , 2024 | 06:21 AM
భారత్‌లో రెండో అతిపెద్ద ధనవంతుడైన గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం.. తమ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో వాటాలను సర్దుబాటు చేసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. వచ్చే 9 నెలల్లో గ్రూప్ కంపెనీల్లో మొత్తం రూ.30,000 కోట్ల
అంబుజా సిమెంట్స్‌లో ఇప్పటికే రూ.4,250 కోట్ల వాటా అమ్మకం
న్యూఢిల్లీ: భారత్‌లో రెండో అతిపెద్ద ధనవంతుడైన గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం.. తమ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో వాటాలను సర్దుబాటు చేసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. వచ్చే 9 నెలల్లో గ్రూప్ కంపెనీల్లో మొత్తం రూ.30,000 కోట్ల విలువైన వాటాలను విక్రయించాలనుకుంటున్నట్లు తెలిసింది. ఈ కుటుంబం అంబుజా సిమెంట్స్‌లో రూ.4,250 కోట్ల విలువైన 2.8 శాతం వాటాను బహిరంగ మార్కెట్లో బ్లాక్‌డీల్స్ ద్వారా శుక్రవారం విక్రయించింది. భారతీయ అమెరికన్ రాజీవ్ జైన్‌కు చెందిన జీక్యూజీ పార్ట్‌నర్స్‌తో పాటు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సహా పలువురు ఇన్వెస్టర్లు ఈ వాటా షేర్లను చేజిక్కించుకున్నాయి. అంబుజా సిమెంట్స్‌లో ప్రమోటర్లైన అదానీ కుటుంబానికి 70.33 శాతం వాటా ఉంది. బ్లాక్‌డీల్ తర్వాత ఇది 67.53 శాతానికి తగ్గింది. కాగా, ఈ ఏడాది చివరికల్లా అదానీ పవర్‌లోనూ 3 శాతం వరకు వాటా విక్రయం ద్వారా రూ.8,000-10,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల్లో వాటాను 64-68 శాతం స్థాయిలో ఉండేలా అదానీ ఫ్యామిలీ విక్రయ ప్రణాళికను రూపొందించుకుందని ఓ ఆంగ్లదినపత్రిక కథనం పేర్కొంది.
అంబుజాలో జీక్యూజీకి 3.13 శాతం వాటా: అంబుజా సిమెంట్స్‌లో ఇప్పటికే 1.35 శాతం వాటా కలిగిన జీక్యూజీ పార్ట్‌నర్స్.. తాజా లావాదేవీలో మరో 1.78 శాతం వాటాను రూ.2,746.79 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో కంపెనీలో జీక్యూజీ మొత్తం వాటా 3.13 శాతానికి పెరిగింది.
Updated Date - Aug 24 , 2024 | 06:21 AM