ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP: వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం.. అధిష్టానం అలర్ట్

ABN, Publish Date - Jan 24 , 2024 | 04:48 PM

Andhrapradesh: అధికార పార్టీ వైసీపీలో (YCP) రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పేయగా.. మరికొందరు కూడా అదే బాటలో నడుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైపీపీ అధిష్టానం అప్రమత్తం అయ్యింది.

అమరావతి, జనవరి 24: అధికార పార్టీ వైసీపీలో (YCP) రాజీనామాల పర్వం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పేయగా.. మరికొందరు కూడా అదే బాటలో నడుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైపీపీ అధిష్టానం అప్రమత్తం అయ్యింది. అసంతృప్త నేతలు పార్టీని వీడకుండా ఉండేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం సీఎం జగన్ రెడ్డి (CM Jagan Reddy) స్వయంగా రంగంలోకి దిగారు. అసంతృప్త నేతలతో సీఎం చర్చించాలని నిర్ణయించినట్లు తెలిస్తోంది.


ఈ క్రమంలో వైసీపీని వీడేందుకు యత్నిస్తున్న అసంతృప్త నేతలకు తాడేపల్లి నుంచి పిలుపువచ్చింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన ఎమ్మెల్యేలను సీఎం జగన్ తాడేపల్లికి పిలిపిస్తూ వారితో చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అధిష్టానం పిలుపు మేరకు సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు (MLA TJR Sudhakar Babu) కాసేపటి క్రితమే సీఎంవోకు వచ్చారు. ఇటీవల సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబును పార్టీ ఇంచార్జి నుంచి సీఎం తప్పించిన విషయం తెలిసిందే. మంత్రి మేరుగ నాగార్జునను (Minister Meruga Nagarjuna) సంతనూతలపాడు పార్టీ ఇంచార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో సుధాకర్ బాబుకు ముఖ్యమంత్రి జగన్ టికెట్ నిరాకరించారు. వైసీపీ అధిష్టానం నిర్ణయంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీని వీడే యోచనలో సుధాకర్ బాబు ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాడేపల్లికి పిలిపించిన సీఎం జగన్.. ఆయనతో చర్చలు జరుపునున్నారు. అయితే సీఎం జగన్‌తో చర్చల అనంతరం ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 24 , 2024 | 04:48 PM

Advertising
Advertising