ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ గప్‌చుప్‌

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:50 AM

ఎన్నికల్లో ఫ్యాన్‌ రెక్కలు విరిగాయి. బటన్‌ నొక్కుడు ఏమాత్రం పనిచేయలేదు. ఐదేళ్లపాటు నువ్వెంత అంటూ రెచ్చిపోయే ధోరణిలో వ్యవహరించిన నేతలు, చిన్నా చితక వ్యవహారాలకే చిందులేసిన గ్రామస్థాయి కేడర్‌. అక్రమ కేసులు.. దాడులు, వీలైతే బెదిరింపులతో విరుచుకుపడ్డారు.

అధికారంలో ఉండగా విర్రవీగిన శ్రేణులు

ఓటమితో ఒక్కసారిగా కుదేలు

నియోజకవర్గాల్లో కనిపించని మాజీలు

స్థానిక కేడర్‌లో గందరగోళం

రాజకీయ భవిష్యత్‌పై అయోమయం

వ్యక్తిగత పనులపై బెంగ

కొందరు జనసేన వైపు మొగ్గు

ఆచితూచి అడుగేస్తున్న కూటమి

ఎన్నికల్లో ఫ్యాన్‌ రెక్కలు విరిగాయి. బటన్‌ నొక్కుడు ఏమాత్రం పనిచేయలేదు. ఐదేళ్లపాటు నువ్వెంత అంటూ రెచ్చిపోయే ధోరణిలో వ్యవహరించిన నేతలు, చిన్నా చితక వ్యవహారాలకే చిందులేసిన గ్రామస్థాయి కేడర్‌. అక్రమ కేసులు.. దాడులు, వీలైతే బెదిరింపులతో విరుచుకుపడ్డారు. ఇంతలా రెచ్చిపోయిన వైసీపీ ప్రస్తుతం మిన్నకుండిపోయింది. మాజీ ఎమ్మెల్యేలలు నియోజకవర్గ కేంద్రాలకు దూరంగా ఉన్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా చిన్నా చితక నేతలు ఎక్కడా కనిపించడం లేదు. మాజీ మిగిలిన కొద్దిపాటి మందిలో కూటమివైపు తొంగిచూస్తున్నారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

అధికారంలో ఉండగా అంతా తామే అనుకున్నారు. అసలు సిసలైన పాలకులం మేమేనన్నారు. ఏం జరిగినా మా కను సన్నల్లోనే జరగాలని ఆంక్షలు పెట్టారు. ఉద్యోగులను బెదిరించి మరీ పనులు చేయించారు. కిందిస్థాయిలో టీడీపీ, జనసే న నేతలు, కార్యకర్తలను చూసుకుందాం రండి.. అంటూ సమయం, సందర్భం లేకుండా సవాళ్లు విసిరారు. గ్రామ వ్యవహారాల్లోనే కాదు నియోజకవర్గ వ్యవహారాల్లో సైతం ఇది మా రాజ్యం అనే ధోరణిలోనే తెగ రెచ్చిపోయారు. గోదావరి జిల్లాల్లో ప్రశాంతతను వైసీపీ నేతలు బ్రేక్‌ చేశారు. కొందరు రాజకీయ కక్షపూరిత వ్యవహారంతో పెత్తనం సాగించారు. ఇంకొందరు ఇసుకను తవ్వేశారు. మట్టిని మింగేశారు. ఎవరైనా ప్రతిపక్షానికి చెందిన వారు ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తే ఇదంతా మామూలే అన్నట్టు అధికారుల నుంచి సమాధానం వచ్చేది. తిరుగులేదనుకున్న చోటల్లా గడిచిన ఎన్నికల్లో వేల ఓట్ల మెజార్టీతో కూటమి అభ్యర్థుల గెలుపు. వైసీపీ నేతల అడ్రస్‌ గల్లంతు. అధికార పగ్గాలు తమ చేతిలో ఉన్నాయన్న ధోరణితో ఆఖరుకు పోలీసులను తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం వ్యవహరించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైసీపీ ఏలూరు జిల్లాలో అన్నిచోట్ల మట్టికరి చింది. భారీ మెజార్టీ కూటమి అభ్యర్ధుల సొంతమైంది. ఒకప్పుడు రెచ్చిపోయిన వారంతా గడిచిన కొన్నాళ్లుగా అంతా సైలెంట్‌. మాజీ ఎమ్మెల్యేలతో సహా కొందరు గాయబ్‌. ఇంకొందరు ఇంటిపట్టునే ఉంటూ వచ్చీపోయే వారితో కాసేపు కాలక్షేపం. ఒకప్పుడు నెంబర్‌–2గా నియోజకవర్గాల్లో రెచ్చిపోయి వ్యవహరించిన అత్యధికులు సైతం నేడు అదృశ్యం కాగా కొందరు హైదరాబాద్‌లో ఉన్నారు.

ఉంగుటూరులో జనసేన వైపు?

ఉంగుటూరు నియోజకవర్గంలో పరిస్థితి మరో రకంగా ఉంది. ఇక్కడ జనసేన పక్షాన పత్సమట్ల ధర్మరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సాధ్యమైనంత మేర సామాజిక వర్గాన్ని ప్రామాణికంగా తీసుకుని వైసీపీకి చెందిన కొందరు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యక్తిగత అవసరాలు, పనుల దృష్ట్యా కొందరు తాపత్రయ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుబాబు సైతం ఎవరికీ అందుబాటులో లేరు. నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో జనసేన సైతం ఆచితూచి అడుగేస్తోంది. చేరికలను ప్రోత్సహించే ధోరణి లేదు. అధినాయకత్వం నుంచి సానుకూల సంకేతాలు వస్తే తప్ప పార్టీలో చేరికలు ఉండకపోవచ్చు.

నూజివీడు, కైకలూరు సైలెంట్‌

నూజివీడు, కైకలూరు నియోజకవర్గాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి కేడర్‌ పూర్తిగా సైలెంట్‌ అయ్యా రు. రెండుచోట్ల కూటమికి ఎదురు తిరిగే పరిస్థితి లేదు. గడిచిన ఐదేళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎదురు తిరిగినా తమకే నష్టమని ఒదిగి ఉన్నారు. కైకలూరులో కొంతమంది ఎంపీపీలు, జడ్పీటీసీలు మాత్రం కూటమి వైపు మొగ్గు చూపే ప్రయత్నంలో ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కొద్ది రోజుల వ్యవధిలోనే వైసీపీలో అటో ఇటో తేలబోతుంది. కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఇంటి పట్టునే ఉంటున్నారు. నూజివీడులో ప్రతాప అప్పారావు వ్యక్తిగత వ్యవహారాల్లో బిజీగా గడుపుతు న్నారు. పోలవరం నియోజకవర్గంలో వైసీపీ పూర్తిగా సైలెంట్‌ అయిపోయింది. ఈ నియోజకవర్గంలో తెల్లం బాలరాజు సతీమణి ప్రభుత్వ టీచర్‌ రాజ్యలక్ష్మిని గడిచిన ఎన్నికల్లో పోటీకి దింపినా ఓటమి తప్పించుకోలేకపోయారు. దీంతో ఇప్పటికే వైసీపీ కేడర్‌ పూర్తిగా డీలా పడింది.

ఏలూరు మాజీ అదృశ్యం!

ఏలూరు నియోజకవర్గంలో 65 వేలకుపైగా మెజార్టీతో గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి ఎక్కువ సమయం ప్రజల మధ్యనే కేటాయిస్తున్నారు. మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మాత్రం ఎన్నికల తరువాత అదృశ్యమయ్యారు. నియోజకవర్గంలో ఆయన ఎవరితోను ముఖాముఖి భేటీకి సిద్ధపడడం లేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి నుంచి ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న నాని ఘోర పరాజయంతో ముఖం చాటేశారు. ఎన్నికల ముందు వరకు ఆయనతోనే ఉన్న ముఖ్య నేతలంతా ఒక్కొక్కరిగా పార్టీకి రాజీనామా చేశారు. ఎక్కడా లేనంత వ్యతిరేకత ఇక్కడే కనిపించడంతో నానికి వెన్నంటే ఉన్న మంచెం మైబాబు, బొద్దాని శ్రీనివాస్‌ సైతం ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. మేయర్‌ నూర్జహాన్‌, ఆమె భర్త పెదబాబు, ఇంకొందరు కార్పొరేటర్లు సైతం వైసీపీకి దూరంగా జరిగారు. ఇది ఏలూరులో ఆ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది.

కోటగిరి అమెరికా.. అబ్బయ్యచౌదరి లండన్‌

అధికారం కోల్పోయి రాజకీయ భవిష్యత్‌, వ్యక్తిగత అవసరాల కోసం వైసీపీకి చెందిన అనేకమంది పక్క చూపులు చూస్తున్నారు. ఇంకొందరు సామాజిక అవసరాల కోసమంటూ జనసేనతో సంప్రదింపులు జరుపుతున్నారు. మాజీ ఎంపీ, వైసీపీ నేత కోటగిరి శ్రీధర్‌ గత ఎన్నికల్లో వెనుకడుగువేశారు. ఇప్పుడు ఆయన వర్గమంతా ఆయన ఆదేశాల మేరకు పార్టీలో ఉండాలా, లేక ఎవరి దారి వారు చూసుకోవాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. మాజీ ఎంపీ శ్రీధర్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కొద్దిరోజుల్లోనే జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఇతర మండలాల్లోని కేడర్‌ తమ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తేల్చు కోబుతున్నారు. దశాబ్దాలపాటు కోటగిరి వర్గీయులుగా ఉన్న చింతలపూడిలోని కేడర్‌ ఎటూ తేల్చుకోలేకపోయింది. ఎన్నికల్లో వైసీపీ పక్షానే పనిచేసినా ఓటమి అనంతరం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక సతమతమ వుతున్నారు. చింతలపూడి వైసీపీ రాజకీయాల్లో ఎన్నికల సమయంలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకు న్నాయి. అప్పటి ఎమ్మెల్యే ఎలీజాను పక్కనపెట్టడంతో ఆయన పార్టీ నుంచి వైదొలిగి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఇదే స్థానం నుంచి రవాణ శాఖ అధికారి విజయ రాజును వైసీపీ రంగంలో నిలిపినా ఫలితం దక్కలేదు. అనేక ఎత్తుగడలు, నగదు పంపిణీలో కూటమిపై పైచేయి సాధించినా జనా మోదంలో మాత్రం పూర్తిగా దెబ్బతిన్నారు. ఇప్పుడు చింతల పూడి నియోజకవర్గంలో వైసీపీ కేడర్‌, నేతలు సైలెంట్‌గా ఉన్నారు. ఎటూ పాలుపోక ఓటమి నుంచి తేరుకోక ఎవరితో కనీస సంప్రదింపులకు సాహసించ లేని స్థితిలో ఉన్నారు. ముఖ్యనేతలు మాత్రం ఈ విషయం లో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ కూడా వైసీపీ నుంచి వచ్చేందుకు సుముఖంగా ఉన్న వారిని పార్టీలోకి చేర్చుకుంటే నష్టమని, కొంత సంయమనం పాటించాలనే ధోరణిలో ఉంది. దెందులూరులో ఓటమి తర్వాత అబ్బయ్య చౌదరి లండన్‌ వెళ్లారు. ఆయన సన్నిహితుల్లో అత్యధికులు నియోజకవర్గాన్ని వీడి వ్యక్తిగత పనులంటూ ఇతర ప్రాంతా లకు వెళ్లారు. ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి వర్గం చింతమనేని వర్గంపై విరుచుకు పడుతూ వచ్చింది. అనేకసార్లు దాడులకు దిగింది. మట్టి తవ్వకాల్లో మాత్రం అందరికంటే ముందంజ వేసింది. పోల వరం కుడికాలువ గట్టును ఎక్కడికక్కడ తవ్వి తరలించారు. దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. దెందులూరులో వైసీపీ నేతల్లో అత్యధికు లు పార్టీలోనే కొనసాగుతామని, ఇతర పార్టీల్లోకి వెళ్లేది లేదంటూ కొంత బింకం ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్యే చింతమ నేని ప్రభాకర్‌ పార్టీకి జీవం పోసేలా కేడర్‌ కోసం పూర్తి సమయం కేటాయిస్తున్నారు.

Updated Date - Jul 31 , 2024 | 12:50 AM

Advertising
Advertising
<