ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వెరైటీ శుభలేక

ABN, Publish Date - Aug 21 , 2024 | 12:16 AM

పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన వధు వుకు తన పెళ్లి పత్రిక విభిన్నంగా ముంద్రించి అందిరినీ ఆకట్టుకుంది. తన పెళ్లి పత్రికలో ఎనిమిది ప్రశ్నల రూపంలో పెళ్లి ఆహ్వాన పత్రిక సమగ్ర సమా చారాన్ని పొందు పరిచారు.

ప్రశ్నపత్రంలా ముద్రించిన పెళ్లి ఆహ్వానపత్రిక

పెనుమంట్ర, ఆగస్టు 20 : పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన వధు వుకు తన పెళ్లి పత్రిక విభిన్నంగా ముంద్రించి అందిరినీ ఆకట్టుకుంది. తన పెళ్లి పత్రికలో ఎనిమిది ప్రశ్నల రూపంలో పెళ్లి ఆహ్వాన పత్రిక సమగ్ర సమా చారాన్ని పొందు పరిచారు. సింగిల్‌ ఆన్సర్‌ ప్రశ్నలు, మల్టిఫుల్‌ చాయిస్‌ ప్రశలు, ట్రు ఆర్‌ ఫాల్స్‌ ఇలా వివిధ ప్రశ్నల రూపంలో పెళ్లికి సంబంధించిన సమా చారాన్ని ఇవ్వడంతో పాటు నూటికి నూరు మార్కులు వచ్చినట్టుగా ముద్రిం చారు. వరుడు విశాఖపట్నంకి చెందిన ఫణేంద్ర అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ మెకానికల్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. మార్టేరుకు చెందిన వధువు ప్రత్యూష విశాఖపట్నంలో పైడా కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నది. ఆమెకు ఈనెల 23న వివాహం. వధూవరులు, కన్యా దాతలు పేర్లు, పెళ్లి తేదీ, సమయం, కల్యాణ మండపం, విందుకు సంబంధించి ప్రశ్నలకు సమాధానంతో పెళ్లి ఆహ్వాన పత్రికను తీర్చిదిద్దారు. ఈ పెళ్లి శుభలేఖను బంధువులకు మిత్రులకు పంచారు. పలువురు ఆసక్తిగా చదివి అభినందించారు. అధ్యాపక వృత్తిలో ఉన్న తనకు తన వృత్తిని ప్రతిబింబించే విధంగా ఆహ్వాన పత్రికను ఇవ్వాలనే ఆలోచనతో ఇలా వినూత్నంగా ముద్రించినట్టు వధువు ప్రత్యూష ‘ఆంధ్రజ్యోతి’కి తెలియజేసింది.

Updated Date - Aug 21 , 2024 | 12:16 AM

Advertising
Advertising
<