ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హక్కులు, చట్టాల అమలుకు పోరాటాలు తప్పవు

ABN, Publish Date - Jul 02 , 2024 | 12:33 AM

పోరాటాల ద్వారానే ఆదివాసీలకు హక్కులు, చట్టాలు కల్పించబడ్డాయ ని ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్ముల సురేష్‌ అన్నారు.

కేఆర్‌.పురంలో ఏఐకేఎంఎస్‌ నేతల ర్యాలీ

ట్రైబల్‌ ఫోరం పిలుపుతో కేఆర్‌పురంలో సభ

బుట్టాయగూడెం, జూలై 1: పోరాటాల ద్వారానే ఆదివాసీలకు హక్కులు, చట్టాలు కల్పించబడ్డాయ ని ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్ముల సురేష్‌ అన్నారు. సంతాల్‌ ఆదివాసీ తిరుగుబాటు జరిగి 169 సంవత్సరాలు అవుతున్న సందర్భం గా అఖిలభారత ట్రైబల్‌ ఫోరం పి లుపు మేరకు సోమవారం కేఆర్‌.పురంలో సభ జరగ్గా సురేష్‌ మాట్లాడారు. మన దేశాన్ని వలస పాలనగా సాగించిన బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులకు, స్థానిక భూస్వా ములు, వ్యాపాకుల దోపిడీలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని సంతాల్‌ ప్రాంతం లో ఆదివాసీలు పెద్ద ఎత్తున ఉద్యమించారని, అనేక మంది గిరిజనులు మర ణించారని తెలిపారు. అటువంటి పోరాటాన్ని నేటి గిరిజనులు వారసత్వంగా తీసుకో వాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలకు వ్యతిరేకంగా చట్టాలను ఎత్తివేయడం కోసం కేంద్రం కుట్రలు చేస్తుందని, వాటికి రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని తెలి పారు. పోరాటాలు చేసి సాధించుకున్న 2006 అటవీ హక్కుల చట్టంకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టానికి కేంద్రం చేసిన సవరణ వలన ఆదివాసీలు అడవిలో నివశించే హక్కును కోల్పోతున్నారని తెలిపారు. కారం రాఘవ, సరియం రామ్మోహన్‌, వెట్టి భారతి, పి.శ్రీనివాస్‌, వి.సుబ్బన్న, కేవీ.రమణ, వి.సద్గురు, టి.బాబురావు, కె.ప్రసాద్‌, ఎన్‌.ముక్కారెడ్డి, సర్పంచ్‌లు కారం అరుణ, మాండ్రు శారద, మడివి శ్రీరాములు, కెచ్చెల ముక్కారెడ్డి, ఎంపీటీసీలు మడకం వెంకటలక్ష్మి, కొవ్వాసు గోవిందరాజు, అధిక సంఖ్యలో ఆదివాసీలు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2024 | 12:33 AM

Advertising
Advertising