ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కలెక్టర్‌ వెట్రిసెల్వి నేడు బాధ్యతల స్వీకరణ

ABN, Publish Date - Jun 26 , 2024 | 12:33 AM

ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రిసెల్వి బుధవారం ఉదయం 9.30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు

పూర్వ కలెక్టర్‌ ప్రసన్నవెంకటేశ్‌ రిలీవ్‌

ఏలూరు, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రిసెల్వి బుధవారం ఉదయం 9.30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె 2016లో మదనపల్లి సబ్‌కలెక్టర్‌గా, 2014–19 మధ్య సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం ప్రత్యేకాధికారిగా, తర్వాత నెల్లూరు జేసీగా, ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేశారు. 2024 ఫిబ్రవరి నుంచి స్ర్తీ శిశు సంక్షేమ శాఖలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. తాజా బదిలీల్లో ఆమె ఏలూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. వెట్రిసెల్వి 2014లో ఐఏ ఎస్‌లో 143వ ర్యాంకు సాధించారు. భూసమస్యల పరి ష్కారంలో, ప్రజా సమస్యలను అర్ధం చేసుకుని త్వరితగ తిన నిర్ణయాలు తీసుకోవడంలో ఆమెకు మంచి పేరుంది.

ప్రసన్నవెంకటేశ్‌ రిలీవ్‌

కలెక్టర్‌ బాధ్యతల నుంచి మంగళవారం ప్రసన్నవెంక టేశ్‌ రిలీవ్‌ అయ్యారు. జిల్లాలో విధి నిర్వహణ పరంగా రెండున్నర ఏళ్ళకాలం తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. తనకు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలుపుతూనే ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలను విజయ వంతంగా నిర్వహించటానికి, వరదలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలవటంలోనూ తనకు సహకరించిన ప్రజలకు మీడియా, స్వచ్చంధ సంస్థలకు ఆయన కృతజ ్ఞతలు తెలియచేశారు. మహిళలు, పిల్లలు ఆరోగ్యపోషణపై దృష్టిసారించి సెయింట్‌థెరిస్సా కళాశాల సహకారంతో ఐటీఢౠఏ మండలాల్లో పిల్లలు, మహిళలు కోసం ప్రత్యేక చొరవ తీసుకునే విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు సహకరించిన అధికారులు అంద రికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 26 , 2024 | 12:33 AM

Advertising
Advertising