అపరాధ రుసుం లేకుండా అదనపు పొగాకు అమ్ముకుంటాం
ABN, Publish Date - Jun 20 , 2024 | 12:01 AM
ఎన్‌ఎల్‌ఎస్ పరిధిలోని ఐదు పొగాకు వేలం కేంద్రాల పరిధిలో అదనంగా పండించిన పొగాకును అపరాధ రుసుం లేకుండా వేలం కేంద్రాల్లో అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని రైతు సంఘ నాయకులు, రైతులు కోరారు.
పొగాకు బోర్డు చైౖర్మన్‌కు రైతు సంఘం నాయకుల వినతి
జంగారెడ్డిగూడెం, జూన్ 19 : ఎన్‌ఎల్‌ఎస్ పరిధిలోని ఐదు పొగాకు వేలం కేంద్రాల పరిధిలో అదనంగా పండించిన పొగాకును అపరాధ రుసుం లేకుండా వేలం కేంద్రాల్లో అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని రైతు సంఘ నాయకులు, రైతులు కోరారు. బుధవారం బుధవారం గుంటూరులోని పొగాకు బోర్డు చైౖర్మన్ అద్దంకి శ్రీధర్‌బాబునుఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఈ విషయంపై ఢిల్లీలోని వాణజ్య శాఖకు సిఫారసు చేశానని చెప్పారని రైతు సంఘం నాయకుడు పరిమి రాంబాబు పేర్కొన్నారు. రైతుల సౌకర్యార్ధం పట్టణంలోని రెండు వేలం కేంద్రాలకు ఒక కమ్యూనిటీ హాలు నిర్మించాలని ఛైర్మన్‌ను కోరినట్లు తెలిపారు. రైతు సంఘం నాయకులు, రైతులు వీవీఎస్ ప్రకాశరావు, కరాటం రెడ్డిబాబు, కూచిపూడి రమేష్, అట్లూరి సతీష్, గూడూరి నాగరాజు, కాకర్ల వివేకానంద, అడపా సత్యనారాయణ, ఇల్లూరి రాంబాబు, గద్దే శేషగిరిరావు, పిన్నమనేని మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 20 , 2024 | 12:01 AM