ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

హామీలు అమలు చేస్తాం

ABN, Publish Date - Jun 14 , 2024 | 11:55 PM

ఎన్నికల ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చేసిన వాగ్దానాలు అమలు చేస్తామని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు.

ఏలూరులో విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చంటి

ఏలూరు ఎమ్మెల్యే చంటి, ఎంపీ పుట్టా మహేష్‌

ఏలూరు టూటౌన్‌, జూన్‌ 14: ఎన్నికల ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చేసిన వాగ్దానాలు అమలు చేస్తామని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. బడేటి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రధాన హామీల అమలుకు సంతకం చేశారన్నారు. మెగా డీఎస్సీ పై తొలి సంతకం, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, పింఛన్‌ రూ4వేలకు పెంపు, నైపుణ్య గణన, అన్న క్యాంటిన్లు పునరుద్దరిస్తూ సీఎం ఐదు సంతకా లు చేశారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే వాగ్దానాలు నెరవేరుస్తూ ప్రారంభించామన్నారు. ఐటీ మంత్రి లోకేశ్‌ ఆధ్వర్యంలో ఐటీ, విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కూటమి విజయంలో యువత ముఖ్యపాత్ర వహించారని, ఉపాధి కల్పిస్తామన్నారు.

ఆరు నెలల్లో ప్రతి హామీ నెరవేరుస్తాం

బుట్టాయగూడెం: ప్రతి హామీని ఆరు నెలల్లో నెరవేర్చేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఎంపి పుట్టా మహేష్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఎంపీకి ఈవో ఆకుల కొండలరావు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎంపీ మాట్లాడుతూ తొలి ఐదు సంతకా లతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాచరణకు దిగారన్నారు. పార్లమెంటు పరిధిలో యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని యువత వ్యక్తిగత సమాచారాన్ని తమ కార్యాలయంలో ఇవ్వాల న్నారు. పరిశ్రమలు తేవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రహదారుల మరమ్మ తులకు కలెక్టర్‌తో మాట్లాడటం జరిగిందన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని, పార్లమెంటులో ఆయిల్‌పామ్‌ రైతుల సమస్య లపై మాట్లాడతానన్నారు. ఘంటా మురళి రామకృష్ణ, మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్‌కుమార్‌, రావూరి కృష్ణ, చెరుకూరి శ్రీధర్‌, కొండ్రెడ్డి కిషోర్‌, పగడం సౌభాగ్యవతి, కొప్పాక శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

కామవరపుకోట: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సహకరిస్తానని, మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ అన్నారు. తాడిచర్ల రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని, దశల వారీగా వనరులు సమకూరుతాయని మహేష్‌కుమార్‌ హామీ ఇచ్చారు. వేముల హనుమంతు, అబ్బూరి సత్య ప్రకాశరావు, యలమర్తి శ్రీను, అబ్బూరి గంగా ధరరావు, అబ్బూరి రత్నరావు, జోనుబోయిన అబ్బులు, తదితరులు ఉన్నారు.

మాట నిలబెట్టుకుంటాం : చింతమనేని

దెందులూరు: ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి మాట నిలబెట్టుకుంటామాని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌రావు అన్నారు. దెందులూరు ఎన్‌టీఆర్‌ సెంటర్‌లో చింతమనేని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చంద్రబాబు సీఎం గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐదు సంతకాలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికి రుణపడి ఉంటానన్నారు. యిప్పిలి వెంకటేశ్వరావు, పెనుబోయిన శేషారత్నం, గారపాటి కొండయ్యచౌదరి, సంపంగి వేణుగోపాలతిలక్‌, సర్పంచ్‌ తోట ఏసమ్మ, పెనుబోయిన మహేష్‌ యాదవ్‌, దాసే శ్రీను, కొలుసు నాని, మిల్లుబాబు, మోతుకూరి నానిబాబు, తదితరులు పాల్గొన్నారు.

పెదవేగి: ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. జడ్పీ సీఈవో కెఎస్‌ఎస్‌. సుబ్బారావు, డీబీఆర్‌సీ డివిజన్‌ కోఆర్డినేటర్‌ బీహెచ్‌ఎన్వీ.కృష్ణంరాజు. ఎక్సైజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ కుమరేశ్వరన్‌. మహిళా శిశు సంక్షేమశాఖ పీడీ పీవీఎల్‌.పద్మావతి, సీడీపీవోలు విజయలక్ష్మి, సునీల్‌ రాజశేఖర్‌, పద్మావతి తదితరులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకరంగా కలిశారు.

Updated Date - Jun 14 , 2024 | 11:55 PM

Advertising
Advertising