ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టార్గెట్‌ సెంచరీ

ABN, Publish Date - Aug 21 , 2024 | 01:16 AM

రాష్ట్రంలో ఐదేళ్ళ దుర్మార్గ పాలన అంతమై.. మెరుగైన పాలన కళ్ళెదుటే ఉండాలని ప్రజలు కోరుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీయాలని ఆకాంక్షిం చారు.

ఆ దిశగా కూటమి ప్రభుత్వం సన్నాహాలు

జల జీవన్‌ కింద నాలుగు వేల కుళాయి కనెక్షన్లు

రెండు వేల ఎకరాల ఉద్యాన వనాల విస్తరణ

అన్ని శాఖల్లోను అప్రమత్తత..

యంత్రాంగంలోను కదలిక

రాష్ట్రంలో ఐదేళ్ళ దుర్మార్గ పాలన అంతమై.. మెరుగైన పాలన కళ్ళెదుటే ఉండాలని ప్రజలు కోరుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీయాలని ఆకాంక్షిం చారు. నాటి నిరాశ, నిస్పృహల స్థానంలో యంత్రాం గం పరుగులు తీయాలని భావించారు. రెండు నెలలు గడవక మునుపే పేదలు ఎదురు చూస్తున్నట్టు ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాలనలో వాడివేడి పెంచినట్టుగానే కొన్ని రంగాల్లో నూరు రోజుల్లోనే అసలు లక్ష్యాలను సాధించాలని లక్ష్యాలను ఎంచుకుంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

కొన్నేళ్ల క్రితం జిల్లాలో జల జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికి కుళాయి అందించాలనే పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. కాని జగన్‌ సర్కార్‌ దీనిని గాలికొదిలేసింది. కనీసం జిల్లాస్థాయిలో ఒకసారి కూడా ఉన్నతస్థాయి సమీక్ష జరగ లేదు. అధికారుల నుంచి నివేదికలు రప్పించి ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు నడపాలో అప్పటి ప్రభుత్వానికి పట్టలేదు. వాస్తవానికి జిల్లాలో రూ.230 కోట్లతో 133 గ్రామాలకు తాగు నీటి ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు. వీటి కింద ఇంటింటికి మంచినీటి కుళాయి కనెక్షన్‌ను అమర్చాలని లక్ష్యంగా తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు దీనిపై ఫోకస్‌ పెట్టింది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి కనెక్షన్లకు భారీగా డిమాండ్‌ ఉంది. ఇప్పటికే కుళాయి కనెక్షన్‌ కోసం ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు వంటి మునిసిపాలిటీల్లోను దరఖాస్తులకు కొదవలేదు. పల్లె సీమల్లోను సాధారణ కుళాయి కనెక్షన్లు ఇప్పటికే తొలగించారు. ఇంటింటికి కుళాయి కనెక్షన్లను మాత్రమే కొనసాగిస్తున్నారు. తాగునీటికి సొంత కుళాయి కనెక్షన్‌ ఉంటే ఇంటి యజమానికి కొండంత అండ. రాబోయే వంద రోజుల్లో ఆరు నూరైనా కనీసం కుళాయి కనెక్షన్‌ ఏమిటో ఇచ్చి చూపించాలని ప్రభుత్వం సవాల్‌గా భావిస్తోంది. వంద రోజుల్లో జిల్లావ్యాప్తంగా నాలుగు వేల కుటుంబాలకు ఈ తరహా కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం నిర్ణయించుకుని పరుగులు పెట్టడం ఆరంభించింది. సాధారణంగా తాగునీటి కొరత డెల్టా ప్రాంతంకంటే మెట్టలోనే అత్యధికం. మంచినీటి చెరువులు, మంచినీటి బావులు ఏనాడో అదృశ్యమయ్యాయి. ఇప్పుడు తాగు నీరందించే బాధ్యత ప్రభుత్వం మీద పడింది. ఆ మేరకు కుళాయి కనెక్షన్‌ కోసం ఎదురుచూసే కుటుంబాల సంఖ్య 20 వేలకుపైగా ఉంది. కేంద్ర సాయం ఉండనే ఉంది కాబట్టి జల జీవన్‌ మిషన్‌ను పూర్తిగా వినియోగించాలని కూటమి ప్రభు త్వం భావిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అప్రమత్తమై తమ ప్రాంతాల్లో ఈ తరహా డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని అధికారులను అప్రమత్తం చేశారు.

మరో టార్గెట్‌ ఉద్యాన పంటలు

పల్లెల్లో జల జీవన్‌ మిషన్‌ కింద కుళాయి కనెక్షన్‌ ఎలా కోరుకుంటున్నారో మెట్ట ప్రాంతాల్లో ఉద్యాన పంటల విస్తరణకు రైతులు అలాగే కోరుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాబోయే వంద రోజుల్లోనే ఈ తరహా పంటలు విస్తరించాలని ఇప్పటికే జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ ఆరంభమైంది. ఉద్యాన పంటల విస్తరణకు సంబంధిత శాఖలకు లక్ష్యాలు నిర్ణయించడమే కాకుండా రైతులు కలిసొచ్చేలా విస్తృత ప్రణాళిక అమలు చేయబోతున్నారు. ఇప్పటికే ఆయిల్‌ఫాం, ఖోఖో సాగులో జిల్లా రాష్ట్రంలోనే తొలిస్థానంలోనే ఉంది. దీనికితోడు ఉద్యాన పంటల విస్తరణకు వీలుగా సమీకృత ఉద్యాన వనాలు అభివృద్ధి, రాష్ట్రీయ కృషి వికాస యోజన, గ్రామీణ ఉపాధి హామీ పథకాల్లో రెండు వేల హెక్టార్లలో ఈ తరహా పంటలను అభివృద్ధి చేయాలని కార్యాచరణ రూపొందించింది మొదలు ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పెదవేగి మండలం ఉద్యాన పంటల్లో జిల్లాలోనే అత్యధికం. ఈ తరహా విధా నం అన్నిచోట్ల అమలయ్యేలా రైతుల ఆశలు, ఆకాంక్షలను పరిగణనలోకి తీసు కుంటున్నారు. ఈ క్రమంలోనే ఉద్యాన పంటల విస్తరణకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వంద రోజుల వ్యవధిలోనే పంటల విస్తీర్ణంకు ఏం చేయబోతున్నారో, ఎలాంటి ఫలితాలు రాబట్టబోతున్నారో నివేదికలు కోరింది. దీనిని ఆషామాషీగా తీసుకోకుండా సీరియస్‌గానే భావిస్తూ తగిన ఫలాలు రైతుల కళ్ళెదుట కనపడి తీరాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఉద్యాన పంటలవైపు ఆశతో ఉన్న రైతులు తాజా పరిణామాలతో ఒకింత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అన్నింటిలో ముందుండాలి

జిల్లాను అన్ని రంగాల్లోనూ ముందుం చాలని రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని ఆదే శించింది. ప్రభుత్వ విభా గాల్లో జరుగుతున్న కార్యాచ రణలు, తీసుకుంటున్న చర్యల న్నింటినీ ఆసాంతం గమని స్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు కాక మునుపే తాము ప్రజలకు ఇచ్చిన హామీల్లో అనేకం పూర్తి చేస్తుండగా జిల్లాస్థాయిల్లో ప్రజల కళ్ళెదుట అభివృద్ధి, సంక్షేమం కనిపించాలన్నది ప్రభుత్వం యోచన. ఇప్పటికే ఉచిత ఇసుక విధానం కింద రెండు వేల మెట్రిక్‌ టన్నులను వినియోగదారులకు అందించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇల్లు నిర్మించుకుని బిల్లులు రాని వారిని గుర్తించి వారికి బకాయిలు చెల్లించాలని సంకల్పించారు. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ నియోజకవర్గాల వారీగా ఈ తరహా లబ్ధిదారుల సంఖ్య ఏ రీతిలో ఉంది, వాటికయ్యే వ్యయం ఇతర వివరాలను నివేదికల రూపంలో రాబడుతోంది. టిడ్కో ఇళ్ళను పేద ప్రజలకు అందించేందుకు ఒక ముహూర్తం ఖరారు కావాల్సి ఉంది. ఇలా లక్ష్యాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా కనపడేలా జాగ్రత్తలు పడుతున్నారు. జిల్లా యంత్రాంగం ఎన్నడూ లేని విధంగా వివిధ రంగాలపై సుదీర్ఘ సమీక్షలు, ఆకస్మిక తనిఖీలకు దిగింది.

Updated Date - Aug 21 , 2024 | 01:16 AM

Advertising
Advertising
<