ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అతిసార.. ఆపుదాం

ABN, Publish Date - Jul 05 , 2024 | 11:36 PM

డయేరియా (అతిసార).. ఈ పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారు.

ఏలూరులో డయేరియా అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు

అవగాహన కార్యక్రమాలు చేపట్టిన అధికారులు

ఏలూరు టూటౌన్‌, జూలై 5: డయేరియా (అతిసార).. ఈ పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారు. వాతావరణ మార్పు, వర్షాలు, నీటి కాలుష్యంతో డయేరియా ప్రబలే అవకాశం ఉందని అధికారులు ముందస్తుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. రోజుకు మూడు కంటే ఎక్కువ సార్లు నీళ్ల విరేచనాలు డయేరియాగా భావించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఎక్కువగా డయేరియా బారినపడే అవకాశం ఉంది. ఈ నెల 1 నుంచి స్టాప్‌ డయేరియా పేరిట ఆగస్టు 31 వరకు 60 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు.

అంటువ్యాధులపై అవగాహన ర్యాలీ

ఏలూరు అర్బన్‌: వర్షాకాలంలో దోమలు, ఈగలు వృద్ధి చెంద డం ద్వారా ప్రాణాంతక మలేరియా, అతిసార, డెంగీ, కామెర్ల బారిన పడే ప్రమాదం ఉందని అసిస్టెంట్‌ మలేరియా అధికారి గోవిందరావు హెచ్చరించారు. లంకపేటలో శుక్రవారం నిర్వహిం చిన ర్యాలీలో అంటువ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కలిగించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కీటకాలను నిరోధించవచ్చన్నారు. వైద్య సిబ్బంది శ్రీనివాసరావు, నిర్మల, తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటా ఫీవర్‌ సర్వే..

లింగపాలెం: ఇంటింటా ఫీవర్‌ సర్వే నిర్వహించాలని, ఎవ రికైనా జ్వరం, వాంతులు, విరోచనాలు ఉంటే వెంటనే దగ్గరలో ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్ళాలని డాక్టర్‌ కృష్ణకిషోర్‌ అన్నారు. కె.గోకవరం పీహెచ్‌సీ పరిధిలో శుక్రవారం ఇంటింటా ఫీవర్‌ సర్వే నిర్వహించారు. వర్షాకాలంలో పలు వ్యాధులు ప్రబలుతాయని, ప్రజలను అప్రమత్తం చేయాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు గ్రామాల్లో ప్రతిరోజూ ఇంటింటికి సర్వే నిర్వహించాలని, ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా వారికి వైద్యసహాయం అందించాలన్నారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశు భ్రతతో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మురుగు నిల్వకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యసిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

జాగ్రత్తలు తీసుకుంటున్నాం

నగరంలో డయేరియా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. డ్రెయి నేజీల్లో పూడిక తొలగిస్తున్నాం. సచివాలయ, శానిటరి సెక్రటరీలు, నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బందితో ప్రతీరోజు 50 ఇళ్లను సందర్శిస్తున్నాం. ప్రతీ ఇంటికి ఒఆర్‌ఎస్‌, జింక్‌ ట్యాబ్లేట్లు ఇస్తున్నాం. అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌లో మందులు అందుబాటులో ఉంచాం. ప్రజలకు సరఫరా చేసే తాగునీటిపై ప్రతీ రోజు 400 టెస్టులు చేస్తున్నాం. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు నమోదు కాలేదు.

ఎస్‌.వెంకటకృష్ణ, నగర పాలక సంస్థ కమిషనర్‌, ఏలూరు

అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలవరంలో పలు ప్రాంతాల్లో వాంతులు విరోచనాలు డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలి, పరిస రాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, రక్షిత నీరు తీసుకోవాలి, బయటి ఆహార పదార్థా లను తీసుకోరాదు. భోజనానికి ముందు, మల మూత్ర విసర్జన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రపరుచుకోవాలి. వాంతులు విరోచనాలైతే వైద్యులను సంప్రదించాలి.

టి.కృష్ణరాజు, సీహెచ్‌సీ వైద్యాధికారి, పోలవరం

Updated Date - Jul 05 , 2024 | 11:36 PM

Advertising
Advertising