రహదారులు అధ్వానం
ABN, Publish Date - May 20 , 2024 | 12:01 AM
రాళ్లు తేలిన రోడ్లు.. గోతులు.. చిన్నపాటి వర్షం వచ్చినా మోకాలి లోతు గోతులతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
రాళ్లు, గోతులతో ప్రయాణం నరకం
వర్షాలతో మరింత అధ్వానం
లింగపాలెం / ఉంగుటూరు, మే 19: రాళ్లు తేలిన రోడ్లు.. గోతులు.. చిన్నపాటి వర్షం వచ్చినా మోకాలి లోతు గోతులతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. లింగపాలెం, ఉంగుటూరు మండలాల్లో అధ్వాన రహదారులతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లింగపాలెం మండలం తువ్వచిలుకరాయుడుపాలెం, కొణిజర్ల, కొత్తపల్లి, అయ్యప్పరాజుగూడెం, బాదరాల తదితర గ్రామాల రోడ్లు ప్రమాదకరంగా మారాయి. రోడ్లపై ప్రయాణంలో నరకం కనిపిస్తోం ది. వర్షం వస్తే రోడ్లు, చిన్నపాటి చెరువుల్లా మారుతున్నాయి. ఎంత జాగ్ర త్తగా వాహనం నడిపినా గోతిలో పడితే ఆస్పత్రికే. రోడ్లు ఎక్కడున్నాయో నీటిలో గోతులు ఎక్కడున్నాయో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నా మని పలువురు వాపోతున్నారు. ఐదేళ్లలో నాయకులు, అధికారులు పట్టిం చుకున్న పాపానలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉంగుటూరు మండలం కైకరం నుంచి ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లి మీదుగా రహధారి పెద్ద పెద్ద గోతులతో ప్రమాదాలకు నిలయం గా మారింది. కనీసం గుప్పెడు మట్టి కూడా వెయ్యకపోవడంతో ద్విచక్ర వాహనదారులు నానా అవస్దలు పడుతున్నారు. రాత్రి సమయం, వర్షాలు పడినప్పుడు ప్రయాణం ప్రమాదభరితమే. కైకరం నుంచి అక్కుపల్లి గోకవరం గ్రామం శివారు వరకు ఆటో ప్రయాణాలు భారంగా మారాయి. రహదారుల దెబ్బకు ఆటోవాలాలు కిరాయి పెంచేస్తున్నారు. సత్తాల, సండ్ర గుంట గ్రామాల వద్ద రహదారి గోతులమయంగా కావడంతో ప్రయాణం నరకప్రాయమని స్థానికులు వాపోతున్నారు. అధికారులు దృష్టి సారించి రహదారులు మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - May 20 , 2024 | 12:01 AM