ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామాల అభివృద్ధి లక్ష్యం

ABN, Publish Date - Aug 24 , 2024 | 12:27 AM

గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజ లకు అవసరమైన పనులను గుర్తించి, నిధులు తేవడానికి గ్రామసభలు నిర్వహిస్తుట్లు ఎంపీ పుట్టా మహేశ్‌ యాదవ్‌ తెలిపారు.

కొయ్యలగూడెం గ్రామసభలో వినతిపత్రాలు ఇస్తున్న గ్రామస్తులు

జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు

ఉపాధి పనులపై తీర్మానం

పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు

బుట్టాయగూడెం, ఆగస్టు 23: గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజ లకు అవసరమైన పనులను గుర్తించి, నిధులు తేవడానికి గ్రామసభలు నిర్వహిస్తుట్లు ఎంపీ పుట్టా మహేశ్‌ యాదవ్‌ తెలిపారు. బుట్టాయగూడెంలో శుక్రవారం జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామసభల్లో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నివేదికలు సిద్ధం చేసి కేంద్రం నుంచి నిధులు రాబట్టి పనులు పూర్తిచేస్తామన్నారు. పోలవరం నిర్వాసితు లకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజి చెల్లించిన తర్వాతే కాలనీలకు తరలిస్తామని తెలిపారు. ఏజెన్సీలో రోడ్ల నిర్మాణాలకు ఎంపీ నిధుల నుంచి రూ.3 కోట్లు కేటాయించి నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో సీసీ, లింక్‌ రోడ్లు ఇతర పనులు చేపడతామన్నారు. ఏజెన్సీలో గిరిజనుల కోసం 79 బీఎస్‌ఎన్‌ ఎల్‌ టవర్లను నిర్మిస్తుండగా బుట్టాయగూడెం మండలంలో 40 టవర్లు నిర్మి స్తున్నట్లు ఎంపి తెలిపారు. మంచులవారిగూడెంలో నిర్మించిన బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ను ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. ఏజెన్సీలో ప్రాంతంలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వివరించారు. నాయకులు బొరగం శ్రీని వాస్‌, కరాటం వెంకటరెడ్డినాయుడు, మొగపర్తి సోంబాబు, కరాటం సాయి, గెడ్డమ ణుగు రవికుమార్‌, ఎంపీపీ కారం శాంతి, సర్పంచ్‌ తెల్లం వెంకా యమ్మ, తహసీల్దార్‌ రమేష్‌, అధికారులు పాల్గొన్నారు.

నిడమర్రు: ప్రతి గ్రామ పంచాయతీని స్వర్ణ పంచాయతీగా తీర్చదిద్ద డమే లక్ష్యమని ఎమ్యెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. ఉపాధి హామీ పథ కం పనుల పనితీరు, నాణ్యతా ప్రమాణాల గురించి తోకలపల్లి, ఫత్తేపురం గ్రామసభల్లో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ గ్రామసభల ద్వారా పను లను గుర్తించాలన్నారు. ప్రత్యేకాధికారి షేక్‌ హబీబ్‌ భాషా, ఎంపీడీవో జి.విజ యకుమారి, రుద్రరాజు వెంకటేశ్వరరాజు, తదితరులు పాల్గొన్నారు.

ఉంగుటూరు: నాచుగుంట గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి పాటు పడదామని పిలుపునిచ్చారు. స్థానికు లు గ్రామంలో సమస్యలను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో ఉపాధి పనుల ను ఎంపిక చేసుకోవాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో గ్రామసభ లకు సర్పంచ్‌లు అధ్యక్షత వహించారు. నాచుగుంట సర్పంచ్‌ యేలేటి సునీ త, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, జడ్పీటీసి కొరిపల్లి జయలక్ష్మి, తహసీల్దార్‌ సతీష్‌, ఎంపీడీవో ప్రేమాన్విత, అధికారులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.

భీమడోలు: రాష్ట్రంలో పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. మండల వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించారు. పోల సానపల్లి గ్రామ సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. గ్రామంలోని పలు సమస్యలపై వినతిపత్రాలను అందుకున్నారు. సర్పంచ్‌ షేక్‌ రహీమా బేగమ్‌, అధికారులు, ప్రత్తి మదన్‌, తదితర నేతలు పాల్గొన్నారు. భీమడోలు లో జరిగిన గ్రామ సభకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా చేపట్టబోయే పనుల వివరాలను సభలో చర్చించారు. గ్రామంలోని వివిధ సమస్యలపై పలు వినతిపత్రాలను అందుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమలలో జరిగిన గ్రామసభలో మంచి నీటి సౌకర్యం, పారిశుధ్యం, డ్రెయినేజీ సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే వెంకట్రాజుకు వివరించారు. పంచాయతీ అభివృద్ధ్దికి రూ.1.50 లక్షల నిధులు మంజూరు చేయించి పర్యాటక కేంద్రంగా ద్వారకాతిరుమలను తీర్చిదిద్దుతా మని హామీ ఇచ్చారు. ఐఎస్‌ జగన్నాథపురంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సైతం అభివృద్ధ్ది చేస్తామని చెప్పారు.

పెదపాడు: గ్రామాల సమగ్ర అభివృద్ధికి గ్రామసభలు నిర్వహిస్తు న్నట్లు డీపీవో తూతిక విశ్వనాఽథ్‌ తెలిపారు. మండలంలోని గ్రామ సభల్లో డీపీవో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పనులను గుర్తించాలన్నారు. ఆర్థిక సంవత్సరంలో ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించడం ద్వారా స్వర్ణ గ్రామాల సాధన లక్ష్యమన్నారు. గ్రామ సభల్లో ప్రత్యేకాధికా రులు, సచివాలయ, ఎన్‌ఆర్‌జీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కొయ్యలగూడెం: మండలంలో గ్రామసభలు విజయవంతమయ్యాయి. గ్రామస్థులు పలు సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకొచ్చారు. సీసీరోడ్లు, డ్రైనేజీలు, పుంతరోడ్లు, స్మశాసనవాటికలు, తదితర సమస్యలపై గ్రామసభలో చర్చించారు. అనేక పనులను గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

ఏలూరు రూరల్‌: మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. గుడివాకలంక గ్రామంలో జరిగిన గ్రామసభలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్థానిక నాయకులు, గ్రామస్తులతో చర్చించారు. నంబూరి నాగరాజు, నేతల రవి, సైదు సత్యనారాయణ, ఎంపీడీవో బండి ప్రణవి, కూటమి నాయకులు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. మల్కాపురం, జాలిపూడి, కాట్లంపూడి, చాటపర్రు, శ్రీపర్రు, మాదేపల్లి, గుడివాకలంక, కోమటిలంక, కొకిరాయలంక,పైడిచింతపాడు పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు.

Updated Date - Aug 24 , 2024 | 12:27 AM

Advertising
Advertising
<