ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నామినేషన్ల పరిశీలన పూర్తి

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:29 AM

ఏలూరు జిల్లాలో ఒక పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 140 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా వీటిలో వివిఽధ కారణాలతో 30 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 110 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి.

140 నామినేషన్లకు 30 తిరస్కరణ.. 110 నామినేషన్లు సక్రమం

ఏలూరు సిటీ, ఏప్రిల్‌ 26 : ఏలూరు జిల్లాలో ఒక పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 140 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా వీటిలో వివిఽధ కారణాలతో 30 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 110 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. ఏలూరు ఎంపీ స్థానానికి మొత్తం 17 మంది నామినేషన్ల దాఖలు చేయగా నాలుగు తిరస్కరించారు. 13 సక్రమంగా ఉన్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 123 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 26 తిరస్కరణకు గురయ్యాయి. 97 సక్రమంగా ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా..

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 16 మంది నామి నేషన్‌లు దాఖలు చేయగా ఒక్కటి తిరస్కరించారు. 15 సక్రమంగా ఉన్నాయి. ఉంగుటూరులో 16 మంది నామి నేషన్లు దాఖలు చేయగా ఒకటి తిరస్కరించగా 15 సక్ర మంగా ఉన్నాయి. దెందులూరులో మొత్తం 18 నామి నేషన్లకు మూడింటిని తిరస్కరించగా 15 సక్రమంగా ఉన్నాయి. పోలవరంలో 23 మంది నామినేషన్ల వేయగా వాటిలో పది తిరస్కరించారు. 13 సక్రమంగా ఉన్నట్లు తేల్చారు. చింతలపూడి నుంచి 12 నామినేషన్లు దాఖలు కాగా మూడు తిరస్కరించగా తొమ్మిదింటిని ఆమోదిం చారు. నూజివీడులో 15 నామినేషన్లు దాఖలు కాగా మూడింటిని తిరస్కరించారు. 12 నామినేషన్లను ఆమోదిం చారు. కైకలూరు నుంచి 23 మంది అభ్యర్థులు నామినే షన్లు వేయగా ఐదింటిని తిరస్కరించగా 18 మంది నామి నేషన్లు సక్రమంగానే ఉన్నట్టు గుర్తించారు.

సారథి నామినేషన్‌పై ఉత్కంఠ

నూజివీడు, ఏప్రిల్‌ 26 : నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి నామినేషన్‌ ఆమోదంపై శుక్రవారం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల పరిశీలన సమయంలో అఫిడవిట్‌లో క్లర్కికల్‌ మిస్టేక్స్‌ ఉండడంతో వైసీపీ ప్రతినిధులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ప్రధానంగా సారథిపై ఉన్న కేసుల విషయంలో, ఆయనకు హైదరాబాద్‌లో వున్న సొంత కర్మాగారం యాజమాన్య హక్కులు, షేర్లు, ఐటీ రిటర్న్‌ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆర్వో వై.భవానీశంకరి ఆ విషయాలపై వివరణ కోరారు. పార్థసారథి, ఆయన న్యాయవాదులు వివరణ ఇస్తూ క్లర్కికల్‌ మిస్టెక్స్‌పై హైకోర్టు ఆదేశాలను ఆర్వోకి చూపించడంతో చివరికి నామినేషన్‌ను ఆమోదించారు. దాదాపు ఐదు గంటలపాటు నామినేషన్‌ ఆమోదంపై కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Apr 27 , 2024 | 12:29 AM

Advertising
Advertising