ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రజా వ్యతిరేక విధానాలతో వైసీపీ పతనం ఖాయం

ABN, Publish Date - Apr 24 , 2024 | 12:24 AM

వైసీపీ పతనం ప్రారంభమైందని, మరోసారి జగన్‌ను నమ్మి ఓటు వేస్తే మన భూములు మనకు ఉండవని, విభజన ఆంధ్రప్రదేశ్‌ను గాడిలో పెట్టి అభివృద్ధి చేస్తూ సంపదన సృష్టించి సంక్షేమ పఽథకాలు అందించగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమేనని, ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలందరూ మద్దతు పలకాలని ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ యాదవ్‌ కోరారు.

సీతంపేటలో ప్రచారం చేస్తున్న ఎంపీ అభ్యర్థి మహేష్‌యాదవ్‌, దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్

సీతంపేటలో కూటమి ఎంపీ అభ్యర్థి పుట్టా, ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ఇంటింటి ప్రచారం

దెందులూరు, ఏప్రిల్‌ 23 : వైసీపీ పతనం ప్రారంభమైందని, మరోసారి జగన్‌ను నమ్మి ఓటు వేస్తే మన భూములు మనకు ఉండవని, విభజన ఆంధ్రప్రదేశ్‌ను గాడిలో పెట్టి అభివృద్ధి చేస్తూ సంపదన సృష్టించి సంక్షేమ పఽథకాలు అందించగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమేనని, ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలందరూ మద్దతు పలకాలని ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ యాదవ్‌ కోరారు. మండలంలోని సీతంపేటలో మంగళవారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌రావుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సీతంపేట నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహేష్‌ యాదవ్‌, చింతమనేని మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50 ఏళ్లకే పింఛన్‌ అందిస్తామన్నారు. రైతుల, మహిళల, అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారం చేసి అభివృద్ధి చేయడంతో పాటుగా రాజధాని అమరావతి, పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి అవకాశం ఇవ్వకుండా కూటమిని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకురాలు ఘంటశాల వెంకటలక్ష్మీ, కొఠారు ఆదిశేషులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సూపర్‌ సిక్స్‌ పథకాల కర పత్రాలను పంపిణీ చేసి ఓటర్ల మద్దతు కోరారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మాగంటి నారాయణ ప్రసాద్‌, మండల పార్టీ కార్యదర్శి నాగనబోరున సత్యనారాయణ, క్లస్టర్‌ ఇన్‌చార్జి పరసా వెంకట్రావు, పర్వతనేని రామకృష్ణ, జనసేన, టీడీపీ, బీజేపీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Updated Date - Apr 24 , 2024 | 12:24 AM

Advertising
Advertising