ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కార్యశూరుడు కందుకూరి

ABN, Publish Date - May 28 , 2024 | 12:07 AM

కందుకురి వీరేశలింగం వర్థంతిని పురస్కరించుకుని సోమవారం సీఆర్‌ఆర్‌ విద్యాసంస్థలు, ఏవీఆర్‌ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలోత్సవ్‌ కమిటీ, మానవత సంస్థ, జనవిజ్ఞానవేదిక, హిందూ యువజన సంఘం, జిల్లా రచయితల సంఘం, హేలాపురి కళాకారుల సంక్షేమ సంఘం తదితర సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సీఆర్‌ఆర్‌ కళాశాల ఆడిటోరియంలో ‘కందుకూరి వర్థంతి – సమాలోచన’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు.

కందుకూరి వీరేశలింగం చిత్రపటం వద్ద నివాళి

వర్ధంతి కార్యక్రమాల్లో పలువురి నివాళి

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 27: కందుకురి వీరేశలింగం వర్థంతిని పురస్కరించుకుని సోమవారం సీఆర్‌ఆర్‌ విద్యాసంస్థలు, ఏవీఆర్‌ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలోత్సవ్‌ కమిటీ, మానవత సంస్థ, జనవిజ్ఞానవేదిక, హిందూ యువజన సంఘం, జిల్లా రచయితల సంఘం, హేలాపురి కళాకారుల సంక్షేమ సంఘం తదితర సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సీఆర్‌ఆర్‌ కళాశాల ఆడిటోరియంలో ‘కందుకూరి వర్థంతి – సమాలోచన’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. కందుకూరి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ నాట్యాచార్యులు పార్వతీ రామచంద్రన్‌ శిష్యబృందం, రామానుజ నృత్యధార సంస్థ, స్వర్ణ నృత్యాలయ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, ప్రజానాట్యమండలి గేయాలు ఆకట్టుకున్నా యి. వక్తలు గుడిపాటి నరసింహారావు, ఇమ్మానుయేల్‌, అరుణ, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి తదితరులు మాట్లాడుతూ మహిళలను చైతన్యపర్చేందుకు, వారి విద్యకు కందుకూరి కృషి చేశారన్నారు. మాతృ భాష పరిరక్షణకు పరితపించారని వివరించారు. వితంతు వివాహాలకోసం ఎన్నో కలుపుమొక్కలను ఏరిపారేసిన గొప్ప సైనికుడని కొనియాడారు. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరుగుతున్న నేపథ్యంలో కందుకూరిని స్ఫూర్తిగా తీసుకుని మహిళల హక్కులకోసం, రక్షణకోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రిటైర్డ్‌ ఎస్సై జాన్‌మిల్టన్‌ రాసిన ‘పోలీస్‌స్టేషన్లు–తెలుసుకోవాల్సిన విషయాలు’ పుస్తకాన్ని రిటైర్డ్‌ ఏఎస్పీ భగవాన్‌రాజు ఆవిష్కరించారు. హేలాపురి బాలోత్సవ్‌ ప్రచురించిన ‘కార్యశూరుడు కందుకూరి’ పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆర్‌. సూర్యారావు ఆవిష్కరించారు. బాలోత్సవ్‌ అధ్యక్షుడు ఆలపాటి నాగేశ్వర రావు, ఎస్‌డబ్లూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.సుందరయ్య, సీఆర్‌ఆర్‌ విద్యా సంస్థల కార్యదర్శి ప్రసాద్‌, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌.మనోరమ, సాహితీ స్రవంతి రాష్ట్ర నాయకులు వరప్రసాద్‌, ఆకురాతి జగన్‌, పి.మంగరాజు, జీఎంవీఆర్‌ కృష్ణారావు, రిటైర్డ్‌ జడ్జీ లక్ష్మి, వరప్రసాద్‌ పాల్గొన్నారు.

భీమడోలు: సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి కందుకూరి వీరేశలింగం పంతులు మహిళా జనోద్దారకుడని పలువురు వక్తలు కొని యాడారు. భీమడోలు శాఖా గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరంలో కందు కూరి వీరేశలింగం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. సాంఘిక రుగ్మతలు రూపుమాపారని, మహిళా విద్యకు ఎనలేని సేవ చేశారని పలువురు అర్కొన్నారు. తొలుత విద్యార్థులకు నీతి కథలు నిర్వహించారు. గ్రంథ పాలకుడు శ్రీనివాస్‌, మానవత సంస్థ జిల్లా డైరెక్టర్‌ ఉమామహేశ్వరరావు, మండే సుధాకర్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

చింతలపూడి: స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం వద్ద సంఘ సంస్కర్త కందుకూరి విరేశలింగం పంతులు 105వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మహిళాసంఘం నాయకురాలు ఎం. వరలక్ష్మిదేవి, గోపలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్‌.సూర్య కుమార్‌ మాట్లాడుతూ వీరేశలింగం చేపట్టిన కార్యక్రమాలను, ఆయన జీవిత చరిత్రను వివరించారు. మూడనమ్మకాలను ప్రతిఘటించారన్నారు. కార్యక్రమంలో ఎన్‌.అశోక్‌, ఎ.రాహుల్‌, ఎం.బాలరాజు, ఆర్‌వీఎస్‌ నారాయణ, డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2024 | 12:07 AM

Advertising
Advertising