ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇసుక కావాలంటే.. వేలిముద్ర తప్పనిసరి

ABN, Publish Date - Aug 24 , 2024 | 12:39 AM

ఇసుక డిపోల్లో ఇసుక విక్రయాలు ఇక కట్టుదిట్టం కానుంది. కుక్కునూరు మండలం ఇబ్రహీంపేట ఇసుక డిపో నుంచి గత నాలుగు రోజులుగా భారీఎత్తున ఇసుక విక్రయాలు జరగడంపై ‘ఇసుక రవాణా సక్రమమేనా..?’ అనే శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి పలు చర్యలు చేపట్టారు. ఇక నుంచి ఎవరికి ఇసుక అవసరమో వారు ఇసుక డిపోల కు సమీపంలో ఉన్న సచివాలయం వద్దకు వెళ్లి ఆన్‌లైన్‌లో ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి వేలిముద్ర వేసి డబ్బులు చెల్లించి ఇసుక బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంది.

ఇబ్రహీంపేట ఇసుక డిపోలో ఇసుక అమ్మకాలపై సూచనలు చేస్తున్న జేసీ ధాత్రిరెడ్డి, ఎస్పీ కేపీ శివకిశోర్‌

ఇకపై ఇసుక విక్రయం కట్టుదిట్టం

ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి

ఇసుక డిపోలను పరిశీలించిన ఎస్పీ, జేసీ

కుక్కునూరు, ఆగస్టు 23 : ఇసుక డిపోల్లో ఇసుక విక్రయాలు ఇక కట్టుదిట్టం కానుంది. కుక్కునూరు మండలం ఇబ్రహీంపేట ఇసుక డిపో నుంచి గత నాలుగు రోజులుగా భారీఎత్తున ఇసుక విక్రయాలు జరగడంపై ‘ఇసుక రవాణా సక్రమమేనా..?’ అనే శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి పలు చర్యలు చేపట్టారు. ఇక నుంచి ఎవరికి ఇసుక అవసరమో వారు ఇసుక డిపోల కు సమీపంలో ఉన్న సచివాలయం వద్దకు వెళ్లి ఆన్‌లైన్‌లో ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి వేలిముద్ర వేసి డబ్బులు చెల్లించి ఇసుక బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంది. అనంతరం ఆ రసీదుతో ఇసుక డిపోకు వెళ్తే ఇసుక విక్రయిస్తారు. కాగా శుక్రవారం ఎస్పీ కేపీ.శివకిశోర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి వింజరం, ఇబ్రహీం పేట ఇసుక డిపోలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరపరాదని ఆదేశాలు జారీ చేశారు. ఇబ్రహీంపేట ఇసుక డిపో నుంచి ఇసుక కావాలంటే సమీపంలోని తొండిపాక సచివాలయా నికి, వింజరం డిపో అయితే సమీపంలోని వింజరం సచివాలయానికి వెళ్లి ఇసుక బుక్‌ చేసుకోవాలి. ఇదిలా ఉండగా ఇబ్రహీంపేట ఇసుక డిపో నుంచి గత నాలుగు రోజుల వ్యవధిలో దాదాపు 2 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక అమ్మకాలు జరిగి నట్టు తెలుస్తోంది. ఆ ఇసుకను తెలంగాణకు, ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు తరలించి బ్లాక్‌ మార్కె ట్‌లో అమ్మబోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు సమయం లో ఆధార్‌ కార్డులో చూపిన ఆడ్రస్‌కు ఇసుక చేరిందా.. లేదా అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతు న్నట్టు సమాచారం.

Updated Date - Aug 24 , 2024 | 12:39 AM

Advertising
Advertising
<