ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మొదటి భార్య ఫిర్యాదుపై భర్త మృతదేహం స్వాధీనం

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:34 AM

భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి మొదటి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన ముదినేపల్లి మండలం గురజ గ్రామంలో జరిగింది.

నాగబాబు (ఫైల్‌)

ముదినేపల్లి, ఏప్రిల్‌ 26 : భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి మొదటి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన ముదినేపల్లి మండలం గురజ గ్రామంలో జరిగింది. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్‌ఐ డి.వెంకట్‌ కుమార్‌ కథనం ప్రకారం గురజకు చెందిన కొంగల నాగబాబు (33)కు 2014లో మండవల్లి మండలం నందిగామ లంక గ్రామానికి చెందిన మనీషతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే మనస్పర్థలతో వారు నాలుగేళ్ల క్రితం విడిపోయారు. నాగబాబు 2020లో సింగవరానికి చెందిన యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప. ఈ పరిస్థితుల్లో గురువారం నాగబాబు గుడివాడ వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం తన ఇంటిలో అతడు ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని కుటుంబీకులు గుర్తించారు. ఈ సమాచారం మొదటి భార్యకు తెలియజేయగా, ఆమె గురజ వచ్చి తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ముదినేపల్లి పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేసింది. దీంతో శుక్రవారం ఉదయం పోలీసులు విచారణకు గ్రామానికి వెళ్లే సరికి శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా, మృతదే హాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Apr 27 , 2024 | 12:34 AM

Advertising
Advertising