పశువుల కడుపు పచ్చగా..
ABN, Publish Date - Jun 19 , 2024 | 12:29 AM
పశుగ్రాసం కొరతతో రైతులు ఇబ్బదులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో పాడి పరిశ్రమ అభివృద్ధి నానాటికి కుంటుపడుతోంది. ఈ పరిస్థితులను గమనించిన ప్రభుత్వం పశుగ్రాసం కోసం గడ్డి మొక్కలు పెంచడానికి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను రైతులకు ఉచితంగా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఉపాఽధి హామీలో గడ్డిమొక్కల పెంపకం
పశుగ్రాస పెంపకం ద్వారా పాడి పరిశ్రమకు ప్రోత్సాహం
సన్న ,చిన్న కారు రైతులకు అవకాశం
ఏలూరు సిటీ, జూన్ 18 : పశుగ్రాసం కొరతతో రైతులు ఇబ్బదులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో పాడి పరిశ్రమ అభివృద్ధి నానాటికి కుంటుపడుతోంది. ఈ పరిస్థితులను గమనించిన ప్రభుత్వం పశుగ్రాసం కోసం గడ్డి మొక్కలు పెంచడానికి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను రైతులకు ఉచితంగా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం ఒక రైతు 25 సెంట్ల భూమి నుంచి రెండెకరాలు విస్తీర్ణం వరకు ఈ మొక్కలను పెంచు కోవచ్చు. ఒక ఎకరానికి రెండేళ్లకు సంబంధించి రూ.91 వేలు సాగు ఖర్చులుగా రైతులకు ఉపాధి నిధుల ద్వారా ఉచితంగా అందజేస్తారు. సూపర్ నేపియర్ అనే జాతికి చెందిన గడ్డి మొక్కలను రైతులకు అందజేస్తారు. రైతులు తమ పంట పొలాల్లో దుక్కు దున్ని ఈ గడ్డి మొక్కలను ఎకరానికి 12 వేల నుంచి 13 వేల కణుపులు వేసుకోవాల్సి ఉంది. ఈ కణుపులను వేసిన తర్వాత ఎరువులు వేయడంతో పాటు, కలుపు తీసి మొక్కలు పెంచడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. సన్న, చిన్నకారు రైతులు ఎంతమంది ముందుకొచ్చినా ఈ గడ్డి మొక్కలు పెంచడానికి జాతీయ ఉపాధి హామీ నిధులు కేటాయిస్తారని సంబంధిత శాఖాధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఈ గడ్డి మొక్కలు పెంచడానికి 500 ఎకరాలకు సంబంధించి రైతులు ముందుకొచ్చారు. జిల్లాలో ఎవరైనా ఈ మొక్కలు పెంపకానికి ఆసక్తి ఉంటే పట్టాదార్ పుస్తకం జిరాక్స్ , ఆధార్ జిరాక్స్, 1బీ అడంగల్ కాపీ తీసుకొచ్చి దరఖాస్తు చేసుకోవాలని డ్వామా శాఖాఽధికారులు సూచిస్తున్నారు.
తీరనున్న పశుగ్రాసం కొరత
–ఎ.రాము,పీడీ, డ్వామా శాఖ
ఉపాధి హామీ నిధులతో సూపర్ నేపియర్ గడ్డి మొక్కలు పెంచడం ద్వారా జిల్లాలో పశుగ్రాస కొరత తీరే అవకాశాలు న్నాయి. ఈ మొక్కలు పెంచడానికి ఒక్కొక్క ఎకరానికి రూ.91 వేలు ప్రోత్సాహకంగా అందజేస్తారు. రైతులు ఎవరైనా ముందుకొస్తే ఈ పశుగ్రాస మొక్కలు పెంచడానికి ప్రోత్సాహకాన్ని అందిస్తాం. జిల్లాలో ఇప్పటికే 500 ఎకరాలకు సంబంధించి సన్న చిన్నకారు రైతులు ముందుకొచ్చారు.
Updated Date - Jun 19 , 2024 | 12:29 AM