స్వర్ణ గ్రామాలే ధ్యేయంగా..
ABN, Publish Date - Aug 24 , 2024 | 12:37 AM
స్వర్ణ గ్రామాల సాధనలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషించనుంది. గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పను లకు రూపొందించుకుని వాటికి సంబంధించి ప్రణాళిక రూపకల్ప నకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించారు. జిల్లాలోని 547 గ్రామ పంచాయతీల్లో శుక్రవారం గ్రామ సభలు విజయవంతంగా జరిగాయి.
547 పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ
గ్రామ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన
ఇకపై ఉపాధి హామీ పథకం కీలక పాత్ర
గ్రామ సభల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
జిల్లాలో రూ.223 కోట్లతో గ్రామాభివృద్ధి పనులు
ఏలూరు సిటీ, ఆగస్టు 23 : స్వర్ణ గ్రామాల సాధనలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషించనుంది. గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పను లకు రూపొందించుకుని వాటికి సంబంధించి ప్రణాళిక రూపకల్ప నకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించారు. జిల్లాలోని 547 గ్రామ పంచాయతీల్లో శుక్రవారం గ్రామ సభలు విజయవంతంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న 87 రకాల పనుల్లో ఆయా గ్రామాలకు అవసరమైన పనులను ఈ గ్రామ సభల్లో గ్రామస్థుల సమక్షంలో గుర్తించారు. ప్రత్యేకంగా రూపొం దించిన ఉపాఽధి హామీ యాప్‌లో వాటిని పొందుపరిచారు.
గ్రామ సభల ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, గ్రామాల్లో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పండ్లతోటల పెంపకం, భూగర్భ జలాల పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పెంపకం, పశుసంరక్షణలో భాగంంగా షెడ్లు ఏర్పాటు, పశుగ్రాస పెంపకం వంటి పనులతో పాటు అభివృద్ధి పనుల్లో భాగంగా వివిధ భవనాల నిర్మాణం, సీసీ రహదారులు, డ్రెయిన్లు, పుంత రహదారులు, చెరువుల పూడికతీత వంటి అనేక కార్యక్రమాలను గ్రామ సభల్లో గుర్తించారు. స్వర్ణ గ్రామ పంచాయతీలే ధ్యేయంగా ఉపాఽధి హామీ పథకం కింద జిల్లాలో రూ. 223 కోట్ల మెటీరియల్ కాంపో నెంట్‌తో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు నూజివీడు మండలం బోర్వంచ గ్రామ సభలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం జరుగుతున్న పనులతో పాటు రానున్న మార్చి 31 నాటికి గ్రామీణ రహదారులు, మురుగునీటి కాల్వ, పంట కాల్వల పూడికతీత పనులు, పండ్లతోటల పెంపకం, పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్ళకు షెడ్లు నిర్మాణం వంటి పనులను గ్రామ ప్రజల ఆమోదం ద్వారా చేపట్టడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వివరించారు. ద్వారకా తిరుమలలో జరిగిన గ్రామ సభలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు పాల్గొన్నారు. బుట్టాయిగూడెం మండలంతోపాటు వివిధ మండలాల్లో జరిగిన గ్రామ సభల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పాల్గొన్నారు. జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతి నిధులు ఆయా నియోజకవర్గాల్లోని గ్రామ సభల్లో పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక : కలెక్టర్
చింతలపూడి : గ్రామసభల్లో ప్రజా అవసరాలను గుర్తించి ప్రణాళిక ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీలో శుక్రవారం జరిగిన గ్రామసభలో పాల్గొని ఆమె మాట్లాడారు. 2024–25 ఆర్ధిక సంవత్సరంలో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులు గుర్తింపుకు జిల్లాలోని 547 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ప్రగడవరం గ్రామాన్ని మోడల్ పంచాయతీగా తీసుకురావడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పంచాయతీ వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. జిల్లా నీటియాజమాన్య సంస్థ పి.డి రాము మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో వేతనదారులకు ఏడాదిలో 100రోజులు పని కల్పిస్తారని, కుటుంబంలో ఒక్కరికి మాత్రమే జాబ్‌కార్డు ఇస్తారన్నారు. ప్రగడవరం గ్రామసభలో అంతర్గత రోడ్లు కోసం మెటీరియల్ కాంపౌండ్ కింద 8 సీసీరోడ్లు, పంట కాలువ పనుల కింద 13 పనులు, పండ్ల తోటలకు ఉపాధి సహకారం ఇవ్వాలని గుర్తించారన్నారు. గ్రామ సచివాలయ ప్రాంగణంలో కలెక్టర్, ఎమ్మెల్యే మొక్కలు నాటారు.
అవకతవకలకు పాల్పడితే చర్యలు
ఉపాధి హామీ అధికారులపై మంత్రి పార్థసారథి ఆగ్రహం
ముసునూరు : ‘రమణక్కపేటలో గతంలో జరిగిన ఉపాధి పనులపై విచారణ చేయిస్తాం.. అధికారులు అవకతవకలకు పాల్పడినట్టు తేలితే శాఖాపరమైన చర్య లు తప్పవు’ అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. ముసునూరు మండలంలోని రమణక్కపేట గ్రామసచివాలయం వద్ద గురువారం నిర్వహించిన ఉపాధి హామీ ప్రత్యేక గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. గ్రామసభలో ఉపాధి హామీ పథకంలో పను లకు రాని కూలీలకు మస్టర్లు వేయడం, వేతనాల చెల్లింపులు, పనిదినాలు కల్పిం చడంలో అధికారుల పనితీరుపై కూలీలు మంత్రికి ఫిర్యాదు చేశారు. మంత్రి మాట్లాడుతూ ఈ గ్రామంలో 780 జాబ్‌కార్డులు యాక్టీవ్‌లో ఉండగా, పనిదినాలు 35 వేలు మాత్రమే ఉండడం ఏమిటని, ఒక జాబ్‌కార్డుకు 100 రోజులు పనిదినాలు కల్పించాల్సి ఉండగా, ఎందుకు మీరు పూర్తిస్థాయిలో పనికల్పనకు చర్యలు తీసుకోలేదంటూ ఏపీవో రోజ్‌లీల, ఈసీ జయప్రసాద్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇష్టానుసారంగా పనులు కల్పించడం ఏమిటని మండిపడ్డారు. పనికి రాకుండా మస్టర్లు వేయడం, పనిచేసిన వారికి తక్కువ వేతనాలు చెల్లించడం మీ పనితీరుకు అద్దం పడుతోందని అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి పనుల్లో అనేక అవకతవకలు జరిగాయని, దీనిపై విచారణ చేయించాలని స్థానికులు, కూలీలు కోరగా స్పందించిన మంత్రి విచారణకు ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తాము కృషి చేస్తున్నామన్నారు. గ్రామాల అభివృద్ధికి దోహదం చేసే 87 రకాల పనులను ఉపాధి హామీ కింద చేపట్టుకోవచ్చన్నారు.
Updated Date - Aug 24 , 2024 | 12:37 AM