ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కూల్‌..గా ప్రచారం

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:17 AM

వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ప్రతా పానికి పార్టీ నాయకులు, కేడర్‌ అల్లాడిపోతున్నారు.

నరసాపురం : ఎన్నికల పోలింగ్‌ సమయానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. దీంతో గెలుపుకోసం బరిలో నిలిచిన అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ప్రతా పానికి పార్టీ నాయకులు, కేడర్‌ అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థ్ధులు ప్రచార స్టైల్‌ మార్చారు. గతంలో మాదిరిగా ఉదయం 9 నుంచి కాకుండా 7 గంటల నుంచే ఇంటింటి ప్రచారం మొదలు పెట్టేస్తున్నారు. 11 గంటలకే ముగించి మళ్లీ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు కొనసాగిస్తున్నారు. బహిరంగ సభలు కూడా సాయంత్రం సమయంలోనే పెట్టుకుంటున్నారు. ఇక ప్రచారంలో ఖాళీ సమయం దొరికిందంటే పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు, భవిష్యత్‌ వ్యూహాలపై చర్చిస్తున్నారు. అదే సమయంలో కొందరు పార్టీల్లో స్తబ్దుగా ఉంటున్న వారిని కలిసి వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఎండవేడికి బయపడి ప్రచారాలు ఎప్పుడు ముగుస్తాయా అని కేడర్‌ రోజులు లెక్క బెట్టుకున్నాయి. మొదటి విడతలోనే ఎన్నికలు జరిగి ఉంటే ఈ తిప్పలు తప్పేవని నాయకులు భావిస్తున్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:17 AM

Advertising
Advertising