ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాడి రైతులకు మంచిరోజులు

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:21 AM

పాల దిగుబడులు పెంచేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది.వైసీపీ ప్రభుత్వం పథకాలన్నింటిని రద్దు చేసి పాడి రైతుల నోట్లో మట్టికొట్టింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్క పథకాన్ని పునఃప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నది.

పథకాలను పక్కన పడేసిన వైసీపీ ప్రభుత్వం

పునఃప్రారంభిస్తున్న కూటమి ప్రభుత్వం

రైతుల్లో వెల్లివిరుస్తున్న ఆనందం

ఏలూరు టూటౌన్‌/ భీమవరం రూరల్‌ జూలై 30: రాష్ట్రంలో వ్యవసాయ రంగం తరువాత అంతటి ప్రాధాన్యం గల రంగం పాడి పరిశ్రమ. పాడి రైతులను ఆర్థికంగా భలోపేతం చేసేందుకు,పాల దిగుబడులు పెంచేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది.వైసీపీ ప్రభుత్వం పథకాలన్నింటిని రద్దు చేసి పాడి రైతుల నోట్లో మట్టికొట్టింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్క పథకాన్ని పునఃప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే మినీ గోకులం పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వా నించింది. పశువులకు అవసరమైన గడ్డిని పెంచుకునేందుకు ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు పథకాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ప్రకటించారు. దీంతో పాడి రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

మినీగోకులం పథకం ప్రారంభం

2014–19 సంవత్సరాల మధ్య టీడీపీ ప్రభుత్వం మినీగోకులం పథకాన్ని ప్రారంభించింది. వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ పథకాన్ని రద్దు చేసింది. అంతేకాక షెడ్లు నిర్మించుకున్న రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీలు చెల్లించలేదు. ప్రభుత్వ రాయితీలు మాకు వద్దు బాబు మేము కట్టిన సొమ్ము అయినా మాకు ఇవ్వండి అని అన్నా కానీ ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. మినీగోకులం పథకంలో రెండు పశువులకు షెడ్లు నిర్మించుకోవడానికి లక్షా 15 వేలు టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో 90 శాతం రాయితీతో 1,03,500 ఇచ్చింది. లబ్ధిదారుల వాటా 10 శాతం 11,500 చెల్లించాలి. అలాగే నాలుగు పశువులకు లక్షా 85 వేలు అయితే రాయితీ 1,66,500, రైతు వాటా 18,500, ఆరు పశువుల షెడ్డుకు యూనిట్‌ విలువ 2 లక్షల 30 వేలు. దీనిలో ప్రభుత్వ రాయితీ 2 లక్షల 7500, రైతు చెల్లించాల్సినది 23వేలు.గొర్రెలు, మేకలు, కోళ్లకు షెడ్డు నిర్మించు కునేందుకు 70 శాతం ప్రభుత్వం రాయితీ కల్పించింది. 30 శాతం రైతులు భరించాలి. 20 గొర్రెలు, 20 మేకలకు షెడ్డు నిర్మించుకోవడానికి యూనిట్‌ విలువ రూ.లక్షా 30 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో 91 వేలు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. రైతులు 39 వేలు చెల్లించాల్సి ఉంటుంది. 50 గొర్రెలు, 50 మేకలకు షెడ్డు నిర్మాణానికి రూ.2 లక్షల 30 వేలుగా ప్రభుత్వం నిర్ణయిం చింది. దీనిలో ప్రభుత్వం రూ.లక్షా 61 వేలు రాయితీ ఇస్తుంది. రూ.69 వేలు రైతు కట్టాల్సి ఉంటుంది. 100 కోళ్ళ పెంపకానికి రూ.లక్షా 32 వేలు షెడ్లు నిర్మాణానికి అయితే ఇందులో 92 వేలు రాయితీ ప్రభుత్వం ఇస్తుంది. రైతులు 39 వేలు భరించాల్సి ఉంది. జిల్లాలో 756 మినీగోకులం షెడ్లు రైతులు నిర్మించుకున్నారు. వీటిలో 384 షెడ్లుకు ప్రభుత్వం డబ్బులు చెల్లించింది. మిగిలిన 402 షెడ్లు అసంపూర్తిగా మిగిలిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 1338 షెడ్లకు గాను 742 పూర్తి చేశారు. మిగిలినవి అసంపూర్తిగా ఉన్నాయి.

పశు బీమా పథకం

ప్రమాదవశాత్తు పాడిపశువు చనిపోతే అప్పటి టీడీపీ ప్రభుత్వం పశు నష్టపరిహారం కింద రూ.30 వేలు రైతుకు అందించేది. అలా ఒక రైతుకు ఎన్ని గేదెలు చనిపోయినప్పటికి అన్ని గేదెలకు నష్టపరిహారం చెల్లించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత బీమా పేరుతో 30 శాతం రైతులతో కట్టించింది. అధి కూడా సరిగా అమలు చేయలేదు. చాలా మంది రైతులు పాడి పశువులను కోల్పోయి అటు నష్టపరిహారం అందక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ పశు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక కుటుం బంలో ఆరు గేదెలు వరకు మరణిస్తే నష్టపరిహారం చెల్లించేది. టీడీపీ ప్రభుత్వం ఎన్ని పశువులు చనిపోతే అన్ని పశువులకు నష్టపరిహారం అందించేది.

వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలు

హర్యాన, పంజాబ్‌ రాష్ర్టాల నుంచి పాడి గేదెలు, పాడి ఆవులను కొనుగోలు చేసి 75 శాతం రాయితీతో అర్హులైన రైతులకు అందించేది. పేయి దూడలకు దానా సరఫరా, బీమా కోసం సునందిని పథకాన్ని 75 శాతం సబ్సిడీతో ఉన్న పథకాన్ని వైసీపీ రద్దు చేసింది. చూడి పశువుకు ఈనక ముందు మూడు నెలలు, ఈనిన తరువాత 3 నెలల వరకు 75 శాతం సబ్సిడీతో దాణా సరఫరా, బీమా సౌకర్యంతో ఉన్న క్షీరసాగర పథకాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. పాల ఉత్పత్తిని పెంచేందుకు పాకుడు గడ్డి సరఫరా, సమీకృత దాణా కోసం 90 శాతం సబ్సిడతో సైలేజీ పథకాన్ని రద్దు చేసింది. ఈ పథకాలన్నింటిని కూటమి ప్రభుత్వం పున రుద్ధరించాలని రైతులు కోరుకుంటున్నారు.

Updated Date - Jul 31 , 2024 | 12:21 AM

Advertising
Advertising
<