ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కౌంటింగ్‌కు పక్కా ఏర్పాట్లు

ABN, Publish Date - May 26 , 2024 | 11:46 PM

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఎంతో కీలకం.. ఓట్ల లెక్కింపునకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు అన్ని విధాలా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ కోరారు.

సమీక్షిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

ఏజెంట్లు సహకరించాలి : కలెక్టర్‌

భీమవరం టౌన్‌, మే 26 : పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఎంతో కీలకం.. ఓట్ల లెక్కింపునకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు అన్ని విధాలా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ కోరారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వచ్చేనెల 4 తేదీన జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు సెంటర్లలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉదయం 8 గంటలకే మొదలవుతుందన్నారు.మొదట పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు జరుగుతుందని, అనంతరం ఏడు నియో జకవర్గాల కౌంటింగ్‌ హాళ్లలో ఈవీఎంల ఓట్ల లెక్కి ంపు జరుగుతుందన్నారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కింపునకు 10 టేబుళ్ల ఏర్పాటుకు తొలుత అనుమతి పొందగా, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు అధికంగా పోలైనందున మరో ఐదు టేబుల్స్‌ ఏర్పాటుకు ఎలక్షన్‌ కమిషన్‌ నుంచ్చి అనుమతి లభించిందన్నారు. మొత్తం 15 టేబుల్స్‌ను పార్లమెంట్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుకు విని యోగిస్తామన్నారు. 15 టేబుల్స్‌కు సంబంధించి అద నంగా అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఏర్పాటు కూడా నుంచి అనుమతి పొందామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆయా అసెంబ్లీ కౌంటింగ్‌ హాల్స్‌ నందు అనుమతి పొందిన నాలుగు టేబుల్స్‌ నందు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు జరుగు తుందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని, స్ట్రాంగ్‌ రూముల నుంచి 14 కంట్రోల్‌ యూనిట్లను తీసుకువస్తామని అన్ని టేబుళ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఒక రౌండ్‌ పూర్తయినట్లుగా ఫలి తాన్ని రిటర్నింగ్‌ అధికారి పరిశీలకుల ఆమోదంతో ప్రకటి స్తారన్నారన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం లలో పోలైన ఓట్ల వివరాలను అభ్యర్థులు గాని ఏజెం ట్లకు గాని ప్రతి టేబుల్‌ వద్ద చూపిస్తారన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే చెప్పాలని అంతా పూర్తయ్యాక అభ్యంతరం చెప్పడానికి వీలు లేదని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ ఏజెంట్లు ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చే నెల 4 తేదీ ఉదయం 7 గంటల్లోలోపుగా సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు రిపోర్ట్‌ చేయవలసి ఉంటుందన్నారు.

Updated Date - May 26 , 2024 | 11:47 PM

Advertising
Advertising