కౌంటింగ్‌కు కసరత్తు
ABN, Publish Date - May 26 , 2024 | 11:46 PM
జిల్లాలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అఽధికారి, జిల్లా కలెక్టర్ వై.ప్రసన్న వెంక టేశ్ చర్యలు తీసుకున్నారు.
ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం
కౌంటింగ్ విధుల్లో 938 మంది సిబ్బంది.. శిక్షణ సన్నాహాలు
ఏలూరు సిటీ, మే 26 : జిల్లాలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అఽధికారి, జిల్లా కలెక్టర్ వై.ప్రసన్న వెంక టేశ్ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు స్ట్రాంగ్‌రూమ్‌కు, కౌంటింగ్ హాళ్ళను సందర్శించిన ఆయన కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పా ట్లపై ఆయా ఆర్వోలకు, సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎలకా్ట్రనిక్ ఓటింగ్ మిషన్లు జిల్లా కేంద్రంలోని సర్ సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడంచెల భద్రత నడుమ ఽభద్రపరి చారు. కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టిన జిల్లా అధి కారులు ఇప్పటికే వివిధ శాఖలను సమన్వయం చేశారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కిం పు కోసం 14 మంది వివిధ శాఖల జిల్లా ఉన్నతాధి కారులను అదనపు ఏఆర్వోలుగా నియమించారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందు కు దృష్టి పెట్టిన అధికారులు 938 మందిని ఓట్ల లెక్కింపులో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి సుమారు 13.70 లక్షల మందికి (84.82 శాతం) పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియో గించుకున్నారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బంది కి తొలి విడత ర్యాండ మైజేషన్ పూర్తి చేశారు. వీరిలో కౌంటింగ్ సూపర్ వైజర్లు 289 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 340 మంది, మైక్రో పరిశీలకు లు 309 మంది ఉన్నారు. వీరికి ఈనెల 27 నుంచి విడతల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా ఉన్న తాధికారులు పాల్గొని లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించనున్నారు.
అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు
ఎన్నికల ఫలితాల సమయంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ స్పష్టం చేశారు. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విజయో త్సవ ర్యాలీలు, టపాసులు పేల్చటం వంటివి చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాలపై డ్రోన్స్ ఎగరకుండా రెడ్‌జోన్‌గా ఇప్పటికే ప్రకటించారు.
Updated Date - May 26 , 2024 | 11:46 PM