ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆ ఎంఈవో తీరే అంత!

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:51 AM

గణపవరం ఎంఈవో–1 పి.శేషు పనితీరుపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర, జిల్లా శాఖ నాయకులు గురువారం డీఈవో అబ్రహంకు ఫిర్యాదు చేశారు.

డీఈవో అబ్రహంకు వినతిపత్రం అందజేత

గణపవరం ఎంఈవో శేషు రూ.3.80 లక్షలు అవకతవకలకు పాల్పడ్డారని ఎస్టీయూ ఫిర్యాదు

ఖండించిన ఎంఈవో.. విచారణ చేపడతామన్న డీఈవో

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 18 : గణపవరం ఎంఈవో–1 పి.శేషు పనితీరుపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర, జిల్లా శాఖ నాయకులు గురువారం డీఈవో అబ్రహంకు ఫిర్యాదు చేశారు. ఎంఈవో అక్రమ వ్యవహారాలపై డీఈవోకు అందజేసిన ఫిర్యాదు నకళ్ళను ఇక్కడి పత్రికలకు అందజేశారు. దీనిపై డీఈవో అబ్రహంను వివరణ కోరగా ఎస్టీయూ నాయకులు చేసిన ఆరోపణలపై విచారణ నిర్వహించనున్నట్టు వెల్లడిం చారు. తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని, ఎంఈవోగా పనిచేసిన మండ లాలన్నింటిలో చేపట్టిన అన్ని ఆర్థిక కార్యకలాపాలకు బిల్లులు ఆడిట్‌ కావడంతో పాటు, విచారణలో వాటిని ఉన్నతాధికారులకు అందజేస్తానని ఎంఈవో పి.శేషు వివరించారు. ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.శామ్యూల్‌, కె.ఆర్‌.పవన్‌ కుమార్‌ ఎంఈవోపై చేసిన ఫిర్యాదు ముఖ్యాంశాలివి. ‘శేషు గణపవరం ఎంఈవోగా పనిచేస్తున్న కాలంలో అత్తిలి ఎంఈవో పేరిటవున్న బిల్లులను అప్‌లోడ్‌ చేసి రూ.60 వేలను తన ఖాతాలో జమ చేసుకున్నారు. ఎంఆర్‌సీ గ్రాంట్లు, శాలసిద్ది గ్రాంట్లను కాజేశారు. నిడమర్రు ఎంఈవోగా పనిచేసిన కాలంలో సంతకాలను ఫోర్జరీ చేసి క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడి నిధులను సొంత ఖాతాలో వేసుకున్నారు. స్పోర్ట్స్‌ గ్రాంట్లు, ఎంఆర్‌సీ గ్రాంట్ల బిల్లులను అప్‌లోడ్‌ చేయకుండా స్వాహా చేశారు. సమగ్ర అభ్యసనాభివృద్ధి పథకం(క్లాప్‌) శిక్షణ నిమిత్తం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను నకిలీ బిల్లులు సృష్టించి సొంత ఖాతాకు మళ్ళించారు. నల్లజర్ల ఎంఈవో(ఎఫ్‌ఏసీ)గా పనిచేసిన కాలంలో ఎంఆర్‌సీ గ్రాంట్లు రూ.57 వేలు పూర్తిగా వినియోగించకుండా వాడేసుకు న్నారు. శేషుపై చేసిన ఫిర్యాదుకు సంబంధించిన సీఎఫ్‌ ఎంఎస్‌ బిల్లుల ఐడీలను, వివరాలను ఎనెగ్జర్‌లో పొందుపర్చాం. రూ.3.80 లక్షలను దుర్వినియోగం చేశారు. ఆ ప్రకారం నకిలీ బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌ లోడ్‌ చేసి ప్రభుత్వ నిధులను సొంత ఖాతాకు జమ చేసుకున్న ఎంఈవో శేషుపై నిర్వహించే విచా రణకు తాము పూర్తిగా సహకరిస్తామని ఎస్టీయూ నాయకులు డీఈవోకు వివరించారు. ఆయనపై శాఖాపర మైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 19 , 2024 | 12:51 AM

Advertising
Advertising