ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి
ABN, Publish Date - Jul 13 , 2024 | 12:10 AM
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్నం భోజనాన్ని అందించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరు రూరల్, జూలై 12 : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్నం భోజనాన్ని అందించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కస్తూరిబా బాలికోన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి విద్యా బోధన, మధ్యాహ్నం భోజన నాణ్యతను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభు త్వ పాఠశాలల్లో విద్యాబోధన ఉండాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మి కంగా తనిఖీ చేస్తానని, ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘి స్తే సిబ్బందిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యా ర్థులకు వండిన ఆహారాన్ని తిని నాణ్యతను పరిశీలించారు. డీఈవో అబ్రహం, కమిష నర్ వెంకటకృష్ణ, తహసీల్దార్ మురార్జీ, ఎంఈవో రంగయ్య, ఆ పాఠశాల హెచ్‌ఎం సునీత పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యనభ్యసించిన విద్యా ర్థులకు జాతీయ స్థాయి సంస్థల్లో సీటు సాధించే స్థాయిలో విద్య అందించేలా అధ్యాపకులు మెరుగైన బోధన చేయా లని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సి పాళ్లలతో విద్యాబోధన, విద్యాఫలితాలు, కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలు కొనసాగింపుపై సమీక్షించారు.
Updated Date - Jul 13 , 2024 | 12:10 AM