ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సంకల్ప బలం, క్రమశిక్షణ కలిగి ఉండాలి : కలెక్టర్‌

ABN, Publish Date - Jun 12 , 2024 | 12:05 AM

సంకల్ప బలం, క్రమ శిక్షణ ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్‌ వి.ప్రసన్న వెంకటేశ్‌ అన్నారు.

పెదవేగి, జూన్‌ 11 : సంకల్ప బలం, క్రమ శిక్షణ ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్‌ వి.ప్రసన్న వెంకటేశ్‌ అన్నారు. పెదవేగిలోని జవహర్‌ నవోదయ విద్యాలయం (జేఎన్వీ)లో జరుగుతున్న ఎన్‌సీసీ వార్షిక శిక్షణలో భాగంగా మంగళవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ మాట్లాడుతూ... ‘ విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకునే అవకాశం ఉంటుంది. సంకల్పబలం ఎంతటి సమస్యనైనా తేలిగ్గా పరిష్కరి స్తుంది. ఎన్‌సీసీ శిక్షణ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు దోహదపడుతుంది. వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవడానికి, జీవన నైపుణ్యం, జాతీయ సమైక్యత, జాతినిర్మాణం అంశాలపై అవగాహన కల్పించడానికి ఎన్‌సీసీ శిక్షణ ఉపయోగపడుతుంది’.. అన్నారు. ఎన్‌సీసీ కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ ఎస్‌.ముఖర్జీ, హవల్దారు సత్యరాజ్‌, నవోదయ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వైఎస్‌ఎస్‌.చంద్రశేఖర్‌, పెదవేగి తహసీల్దారు సూర్యప్రభ పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:06 AM

Advertising
Advertising