ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కోకో.. కేక

ABN, Publish Date - May 22 , 2024 | 12:25 AM

పెరిగిన పెట్టుబడి వ్యయంతో అదనపు ఆదాయానికి రైతులు అంతర్‌ పంటల వైపు దృష్టి పెట్టారు. వీటిలో ప్రధానమైనది కోకో. మెట్టలో ఎక్కువగా సాగయ్యే కొబ్బరి, ఆయిల్‌పామ్‌, నిమ్మవంటి ప్రధాన పంటలతోపాటు దీనిని అంతరపంటగా వేస్తున్నారు.

వెయ్యికి పెరిగినా.. రూ.550 వద్ద నిలిచిన ధర

వాతావరణ మార్పులతో తగ్గిన దిగుబడి

అయినప్పటికీ రైతులకు లాభదాయకం

అంతర పంటలుగా సాగు.. రాయితీలతో మొగ్గు

పెదవేగి, మే 21 : పెరిగిన పెట్టుబడి వ్యయంతో అదనపు ఆదాయానికి రైతులు అంతర్‌ పంటల వైపు దృష్టి పెట్టారు. వీటిలో ప్రధానమైనది కోకో. మెట్టలో ఎక్కువగా సాగయ్యే కొబ్బరి, ఆయిల్‌పామ్‌, నిమ్మవంటి ప్రధాన పంటలతోపాటు దీనిని అంతరపంటగా వేస్తున్నారు. కరోనా కారణంగా మూడేళ్ళపాటు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్న రైతులు ఈ అంతర్‌పంటలే కొంతమేర ఆదుకున్నాయి. ఏలూరు జిల్లాలో 32,451 ఎకరాల విస్తీర్ణంలో కోకోను సాగు చేస్తుండగా, ఒక్క పెదవేగి మండలంలోనే ఎనిమిది వేలల్లో వుంది. కోకో ఏడాది పొడవునా కాపు ఉన్నప్పటికీ మార్చి నుంచి మే నెలాఖరు అంటే మూడు నెలలపాటు దిగుబడి బాగుంటుంది. ఈ సమయంలో వచ్చిన గింజలు అధిక నాణ్యత కలిగి, మెరుగైన ధర వస్తుంది. ఈ ఏడాది కోకో కాపు తగ్గి, దిగుబడి 20 శాతానికి పడిపోయింది. దీంతో రైతుల దగ్గర కోకో గింజలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఎకరానికి సరాసరిన ఐదు క్వింటాళ్ళ దిగుబడి వచ్చేది. కానీ ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో ఎకరానికి క్వింటాన్నర మించి దిగుబడి రాలేదు.

కిలో వెయ్యికి చేరి..

కోకో గింజలు అత్యధిక ధర కిలో రూ.245. కాని, ఈ ఏడాది ప్రారంభంలో రూ.255లకు చేరి అక్కడి నుంచి పెరుగుతూ ఏప్రిల్‌ నెలాఖరు నాటికి రూ.వెయ్యి చేరింది. మళ్లీ క్రమేపీ తగ్గుతూ రూ.550 దగ్గర ఆగింది. రూ.వెయ్యి ధర అందుకున్నా రైతు ఆర్థికంగా పుంజుకున్నది లేదు. కాపు బాగుంటే ఐదు క్వింటాళ్ళకు పైబడి దిగుబడి వచ్చేది. ఇదే ధర ఉంటే రూ.ఐదు లక్షలకు తగ్గకుండా ఆదాయం వచ్చేది. కానీ క్వింటాన్నర మించి రాలేదు. దీంతో ఆ రూ.లక్షకే ఆదాయం పరిమితమైందని రైతులు పేర్కొంటున్నారు. కాపు లేకపోవడానికి, ధర పెరుగుదలకు సంబంధం ఉందని రైతులు చెప్పడం లేదు. అలాగైతే గతంలో ఇంతకంటే తక్కువ దిగుబడి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఆ సమయంలో రూ.240 మించి ధర పలకలేదు. ఈసారి ఏకంగా కిలో రూ.వెయ్యికి చేరిందంటే కోకోకు మంచి భవిష్యత్‌ ఉంటుందనే నమ్మకాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ధర పెరుగుదలకు ప్రధాన కారణం.. ఘనాలాంటి ఆప్రికా దేశాల్లో కోకో పంటను విస్తారంగా పండిస్తారు. ఈసారి పంటంతా తెగుళ్లకు గురై, తోటలన్నీ తొలగించారు. తిరిగి కొత్తగా మొక్కలు నాటడానికి ఆరు నెలలపాటు విరామం ఇచ్చారు. దీంతో దిగుమతి లేకపోవడంతో స్థానికంగా వున్న పంటకు డిమాండ్‌ పెరిగి, ధర పెరిగినట్లు రైతులు చెబుతున్నారు.

భారీగా తగ్గిన దిగుబడి

గతేడాది డిసెంబరులో మూడు రోజు లపాటు కురిసిన అకాల వర్షంతోపాటు వాతావరణ మార్పుల కారణంగా పూత తగ్గింది. ఈ కారణంగా 20 శాతానికి పంట దిగుబడి పడిపోయింది. ఏటా ఎకరానికి సరాసరిన ఏడు క్వింటాళ్ళకు తగ్గకుండా దిగుబడి వచ్చేది. ఈ ఏడాది క్వింటాన్నరకే పరిమితమైంది. కోకో పంట దిగుమతి తగ్గడంతో స్థానికంగా పంటకు డిమాండ్‌ పెరిగి, రైతులు ఆర్ధికంగా బలపడే అవకాశం ఉంది.

– ఉండ్రు అంబేడ్కర్‌, కోకో రైతు, తాళ్ళగోకవరం

ధర పెరిగినా.. ఆదాయమేదీ..?

కోకో గింజల ధర ఆశించని రీతిలో పెరిగినా ఆదాయంలో పెరుగుదల కనిపించడం లేదు. సాధారణంగా ఏటా ఎకరానికి ఐదు క్వింటాళ్ళకు తగ్గకుండా దిగుబడి వచ్చేది. ఇప్పుడు క్వింటాన్నరకు మించి రాలేదు. దీంతో అప్పుడు ధర రూ.240 ఉన్నా, ఇప్పుడు రూ.వెయ్యికి వెళ్ళినా రాబ డి ఒకేలా ఉంది. ధర పెరుగుదల ఆశను కల్పిస్తోంది. రూ.500కు తగ్గకుండా ధర ఉంటే ఏటా రెండు న్నర లక్షలకు తగ్గకుండా ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

– ఆలపాటి సత్యనారాయణ, కోకో రైతు, పెదవేగి

రాయితీలతో మరింత లబ్ధి

కోకో సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోంది. మొక్కల పంపిణీ నుంచి మూడేళ్లపాటు వాటి నిర్వహణ వ్యయాన్ని భరిస్తోంది. మొక్క నాటిన తొలి ఏడాది హెక్టారుకు రూ.12 వేలు, ఆపై రెండేళ్ళపాటు ఏడాదికి రూ.4 వేలు చొప్పున రూ.8 వేలు చెల్లి స్తోంది. అవసరమైన ఇతర యంత్ర పరికరాలను రాయితీపై ఇస్తున్నారు. ప్రభుత్వ పఽథకాలను వినియోగించుకుని, సాగు భారాన్ని తగ్గించుకోవాలి.

– ఎం.రత్నమాల, పెదవేగి ఉద్యానశాఖాధికారి

Updated Date - May 22 , 2024 | 12:25 AM

Advertising
Advertising