ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నారాయణపురం టు ఈతకోట

ABN, Publish Date - Apr 16 , 2024 | 12:27 AM

ఎన్నికల ప్రచారం లో భాగంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం భీమవరంలో ‘మేమంతా సిద్ధం’ సభ నిర్వహించనున్నారు.

ఉమ్మడి పశ్చిమలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. నేడు భీమవరంలో సిద్ధం సభ

నియోజకవర్గానికి 150 బస్సులు..

పది వేల మంది తరలింపునకు ఆదేశాలు

ఆర్టీసీ నుంచి 140 బస్సుల కేటాయింపు

భీమవరం, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి):ఎన్నికల ప్రచారం లో భాగంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం భీమవరంలో ‘మేమంతా సిద్ధం’ సభ నిర్వహించనున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు మండ లం నారాయణపురం చేరుకున్న సీఎం సోమవారం రాత్రి బస ఇక్కడే చేయనున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు నారాయణపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభ మవుతుంది. నిడమర్రు, భువనపల్లి మీదుగా పది గంటల కు గణపవరం చేరుకుంటుంది. తర్వాత సరిపల్లె, కోలమూ రు మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు ఉండి చేరుకుని మధ్యాహ్న భోజనం చేస్తారు. అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు యాత్ర ప్రారంభించి 4.30 గంటలకు భీమవరం చేరుకుంటారు. బైపాస్‌ రోడ్‌లోని జీవీఆర్‌ ప్రభు త్వ జూనియర్‌ కళాశాల వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించేందుకు అధికార పార్టీ నేతలు తలమునకలయ్యా రు. ఒక్కో నియోజకవర్గం నుంచి 150 బస్సుల్లో జనాన్ని తరలించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీకి ఇచ్చేం దుకు ఆర్టీసీ సైతం 140 బస్సులను కేటాయించింది. ప్రతి నియోజకవర్గం నుంచి పది వేల మందికి తక్కువ కాకుం డా జనం హాజరయ్యేలా చూడాలని అధిష్టానం నుంచి ఆదేశాలందాయి. ఇందు కోసం అభ్యర్థులంతా ఆపసోపాలు పడుతున్నారు. భీమవరంలో సభ అనంతరం గరగపర్రు– ఉణుదుర్రు, ముదునూరు రావిపాడు మీదుగా బస్సు యాత్ర తణుకు చేరుతుంది. తణుకు వై.జంక్షన్‌ నుంచి పెరవలి, సిద్ధాంతం మీదుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఈతకోటకు చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు.

సీఎం పర్యటనకు భారీ బందోబస్తు

ఉండి, ఏప్రిల్‌ 15 : సీఎం వైఎస్‌ జగన్‌ బస్సు యాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ వి.రజిత తెలిపారు. సోమవారం ఉండి కోట్ల పంక్షన్‌ హాలు లో సీఎం బస్సు యాత్రకు సంబంధించి పోలీసులకు అవగాహన కల్పించారు. పోలీసులు రోడ్డుకు ఇరు వైపులా భద్రతా సిబ్బందితో ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో జిల్లాలోని ఆయా కేటగిరీల ఉన్నతాధికారు లు పాల్గొన్నారు. సీఎం భద్రతకు సుమారు 1500 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. యాత్రతో పాటు సభ వద్ద కూడా గస్తీగా పెట్టారు.

Updated Date - Apr 16 , 2024 | 12:27 AM

Advertising
Advertising