ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైద్యురాలిపై హత్యాచారం దారుణం

ABN, Publish Date - Aug 21 , 2024 | 12:16 AM

కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచా రాన్ని నిరసిస్తూ భీమవరం నియోజకవర్గ కూటమి నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

భీమవరంలో కొవ్వొత్తుల ర్యాలీలో ఎమ్మెల్యే అంజిబాబు, తదితరులు.

భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు

న్యాయవాదులు, విద్యార్థుల నిరసన ర్యాలీలు

భీమవరం టౌన్‌, ఆగస్టు 20 : కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచా రాన్ని నిరసిస్తూ భీమవరం నియోజకవర్గ కూటమి నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్‌ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ డాక్టర్‌ హత్యాచారంపై విచారణ వేగవంతం చేయాలని, ఇటువంటి ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనంతరం జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మాట్లాడారు. పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్‌, వబిలిశెట్టి రామకృష్ణ, బండి రమేష్‌ కుమార్‌, మండల అధ్యక్షుడు మోకా శ్రీనివాస్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యంరాజు తదితరులు పాల్గొన్నారు.

తణుకు : జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా తణుకు బార్‌ అసోసియేషన్‌, ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసీల్దార్‌ అశోకవర్మకు వినతిపత్రం అందించారు. బార్‌ అసోసియేషన్‌ నాయకులు కొండా శ్రీనివాసు, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, పొట్ల సురేష్‌, అంబేడ్కర్‌, కామన మునిస్వామి, అనుకుల రమేష్‌, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పాలకొల్లు అర్బన్‌ : కోల్‌కతాలో ఇటీవల జరిగిన దారుణ అకృత్యానికి నిరసనగా పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థులు మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యార్థి సంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, ఆదిత్య డిగ్రీ కళాశాల, డీఎన్‌ఆర్‌, ఏఎస్‌ఎన్‌ఎం, చాంబర్స్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఉండి : కోల్‌కతాలో జూనియర్‌ డాక్టరుపై అత్యాచారం చేసి హత్యచేసిన కిరాతకులను తక్షణమే పట్టుకుని తగిన శిక్ష వేయాలని కోరుతూ ఉండి మండ లం యండగండి జూనియర్‌ కళాశాల విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టా రు. అధ్యాపకులు ఎ.శ్రీనివాసరావు, వల్లభు చక్రవర్తి, కేఎస్‌ఎన్‌వీవీఎస్‌మూర్తి, నల్లి రవి, సలోమి, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 12:16 AM

Advertising
Advertising
<