ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అమ్మో బంగారం..

ABN, Publish Date - Apr 18 , 2024 | 12:44 AM

భారీగా పెరిగిన ధరలతో అమ్మకాలు లేక డీలా పడిన బులియన్‌ మార్కెట్‌పై ఎన్నికల కోడ్‌ మరింత ప్రభావం పడుతోంది.

పోలీసు తనిఖీలతో భయం భయం

నరసాపురం టౌన్‌, ఏప్రిల్‌ 17: భారీగా పెరిగిన ధరలతో అమ్మకాలు లేక డీలా పడిన బులియన్‌ మార్కెట్‌పై ఎన్నికల కోడ్‌ మరింత ప్రభావం పడుతోంది. అడుగ డుగునా పోలీసులు తనిఖీలు చేస్తుండడంతో కొనుగోలుదారులు పెద్ద మొత్తం సొమ్ముతో మార్కెట్‌కు వచ్చే సాహసం చేయడం లేదు. వస్తువులు కొని తీసుకెళ్లే సమయంలో పోలీసు తనిఖీ జరిగితే సమాధానం చెప్పాల్సి వస్తోం ది. దీంతో అమ్మకాలు లేక మార్కెట్‌ వెలవెల బోయింది. పసిడి ధర పరుగులతో ఆభరణాల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వివాహాలు, శుభ కార్యక్రమాల నిమిత్తం కొంత మొత్తం వస్తువుల కొనుగోలుకు సైతం తనిఖీల భయం వెంటాడుతోంది. నరసాపురం మార్కెట్‌ బులియన్‌కు ప్రసిద్ధి. ఉమ్మడి పశ్చి మ గోదావరి, సమీప తూర్పు జిల్లా, కృష్ణా జిల్లాల నుంచి కొనుగోలుదారులు ఇక్కడికి వస్తుంటారు. జిల్లాల సరిహద్దు చెక్‌ పోస్టులు, మరో నాలుగైదుచోట్ల తనిఖీ తప్పడం లేదు. దీంతో అవసరం ఉన్నా కొనేందుకు ముందుకు రావడం లేదు. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో కొనుగోలుకు 3 శాతం అదనంగా టాక్స్‌ పడుతోంది. లక్షల్లో కొనుగో లుకు భారీ టాక్స్‌ చెల్లించాల్సిందే. ప్రస్తుతం ఎన్నికల ప్రభావం బులియన్‌ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. రోజుకు రూ.30 లక్షల విక్రయాలు సాగించే దుకాణంలో రూ.లక్ష వ్యాపారం కూడా జరగ డం లేదని వ్యాపారులు వాపోతున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:44 AM

Advertising
Advertising