ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి

ABN, Publish Date - Jun 13 , 2024 | 12:03 AM

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అన్నారు.

ర్యాలీని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ప్రారంభించారు.

భీమవరం టౌన్‌, జూన్‌ 12 : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవా రం ప్రకాశం చౌక్‌ వద్ద జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ప్రారంభించారు. తొలుత బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ మాట్లాడుతూ 14 ఏళ్ల లోపు పిల్లలు స్కూల్లో గాని, అంగన్వాడీలో మాత్రమే ఉండాల న్నారు. బాలలు ఎక్కడైన పని చేస్తున్నట్లు గురి ్తస్తే వెంటనే కార్మిక శాఖకు తెలపాలన్నారు. పని చేయంచుకునే యాజమాన్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఒక టీంను ఏర్పాటు చేసి మూడు రోజుల పాటు ఒక్కొక్క మండలంలో వున్న ఫ్యాక్టరీలను, ఇటుక బట్టీలు, షాపులు, హోటళ్లను తనిఖీ చేస్తారన్నారు. ఇందుకు కోసం రానున్న రెండు నెలల కాలానికి కార్యాచరణ రూపొందించామని కలెక్టర్‌ వివరించారు. పాఠశా లల్లో విద్యార్థు డ్రాపవుట్స్‌పై దృష్టి సారించామ న్నారు. చిన్న తనంలో సంపాద నకు అలవాటు చేస్తే వారు దురాలవాట్లకు పాల్పడే అవకాశముం దన్నారు. జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి, జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారి బి.సుజాత రాణి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని కె.శోభ రాణి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామల, దిశా పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌.ఐ శ్రీలక్ష్మి, శ్రీవిజ్ఞాన వేదిక కన్వీనర్‌ సిహెచ్‌ రంగ సాయి, భీమవరం మండల న్యాయ సేవాధికార సంస్థ, విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యా యులు, భీమవరం ఆదిత్య డిగ్రీ కాలేజ్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌,, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2024 | 12:03 AM

Advertising
Advertising