ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అర్ధరాత్రి మహిళపై దాడి

ABN, Publish Date - Apr 16 , 2024 | 12:32 AM

ఆకి వీడులో ఒక హోటల్లో పని చేస్తున్న మహిళ పని ముగించుకొని ఇంటికి వెళుతున్న సమయంలో ఒక వ్యక్తి దాడి చేసి మెడలో బంగారు తాడు కొట్టే యాలని ప్రయత్నించాడు. స్థాని కులు పట్టుకుని పోలీసు లకు అప్పగించారు.

బాధితురాలి నుంచి వివరాలు తీసుకుంటున్న పోలీసులు

మెడలో చైన్‌ కొట్టేసేందుకు ప్రయత్నం

స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగింత

ఆకివీడు, ఏప్రిల్‌ 15: ఆకి వీడులో ఒక హోటల్లో పని చేస్తున్న మహిళ పని ముగించుకొని ఇంటికి వెళుతున్న సమయంలో ఒక వ్యక్తి దాడి చేసి మెడలో బంగారు తాడు కొట్టే యాలని ప్రయత్నించాడు. స్థాని కులు పట్టుకుని పోలీసు లకు అప్పగించారు. ఆకివీడుకు చెందిన కరక రమణ తన అమ్మతో కలిసి స్థానిక హెచ్‌పీ బంకు సమీపంలో నివాసముంటోంది. హోటల్‌లో పనిచేసు కొంటూ జీవనం సాగిస్తున్నది. రోజూ మాదిరిగానే హోటల్లో పని ముగిసిన తరువాత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి వెళుతుండగా జాతీయ రహదారిపై ఒక వ్యక్తి రమణను బెదిరించి ఆమె దగ్గరున్న రూ.1500 నగదు తీసుకున్నాడు. మెడలో ఉన్న బంగారు తాడును తెంచేందుకు ప్రయత్నిస్తుండగా గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆమె చీరతో మెడకు చుట్టి కేకలు వేయకుండా ఊపిరాడకుండా చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె తలపై రాయితో కొట్టాడు. సమీపంలో ఉన్న యువకులు వచ్చి అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రమణ నుంచి ఎస్‌ఐ బత్తిన నాగబాబు వివరాలు తెలుసుకున్నారు. తలకు మూడు కుట్లు పడి గాయం ఇబ్బంది పెడుతుండడంతో ఆమెను మెరుగైన వైద్యం నిమిత్తం 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తి గుంటూరుకు చెందినవాడని కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 16 , 2024 | 12:32 AM

Advertising
Advertising